టీఆర్‌ఎస్‌ భవన్‌లో వెల్లివిరిసిన సంబురాలుహైదరాబాద్‌,డిసెంబర్‌14(జనంసాక్షి ): స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. పోటీ చేసిన పన్నెండుకు 12 ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థులు విజయ కేతనం ఎగురవేశారు. ఆరు ఏకగ్రీవంగాను, ఆరుఎ పోటీ చేసి గెలుపొందండంతో 12 సటీల్లు టిఆర్‌ఎస్‌ ఖాతాలో పడ్డాయి. దీంతో తెలంగాణ భవన్‌తో పాటు ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లో టీఆర్‌ఎస్‌ శ్రేణుల సంబురాలు అంబరాన్నంటాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని ఉత్సాహంగా ఆడిపాడారు. తెలంగాణ భవన్‌ వద్ద డప్పుల మోతలు, డిజె సౌండ్లతో మార్మోగాయి. బాణాసంచా కాల్చారు. ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు.