ఇందిర పేరును కూడా ఉచ్చరించరా

విజయ్‌ దివస్‌లో కనీసం స్మరించకపోవడం దారుణం

ప్రభుత్వంపై మండిప్డడ రాహుల్‌
న్యూఢల్లీి,డిసెంబర్‌16 (జనం సాక్షి):   మాజీ ప్రధాని ఇందిరా గాంధీ విషయంలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని తప్పుబడుతూ కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ కేంద్రాన్ని తూర్పూరా పట్టారు. 1971 యుద్దానికి సంబంధించి ఢల్లీిలో కేంద్రం ఓ సమావేశం నిర్వహించిందని, ఆ సమావేశంలో ఆనాటి ప్రధాని ఇందిరా గాంధీ పేరును కూడా ఉచ్చరించలేదని తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ దేశం కోసం 32 బుల్లెట్ల దెబ్బలు తిన్నారని, అయినా ఆమె పేరు ప్రస్తావించలేదని రాహుల్‌ తీవ్రంగా మండిపడ్డారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం సత్యానికి చాలా భయపడుతుందని ఎద్దేవా చేశారు. మామూలుగా అయితే ఏ యుద్ధమైనా ఒకటి, రెండేళ్ల వరకూ సాగే ఛాన్స్‌ ఉంటుందని, 1971 లో జరిగిన యుద్ధం మాత్రం కేవలం 13 రోజుల్లో ముగిసిందని, 13 రోజుల్లోనే పాకిస్తాన్‌ లొంగిపోయిందన్నారు. అమెరికా ఆప్గనిస్తాన్‌ను ఓడిరచడానికి 20 సంవత్సరాల సమయం తీసుకుందని, కానీ భారత్‌ మాత్రం దాయాది పాకిస్తాన్‌ను ఓడిరచడానికి కేవలం 13 రోజుల వ్యవధిని మాత్రమే తీసుకుందని ఆయన పేర్కొన్నారు. భారత్‌ మొత్తం ఏకతాటిపై ఉండటంతోనే ఈ అద్భుతం సాధ్యమైందని రాహుల్‌ కొనియాడారు. ఇందుకు ఆనాటి ప్రధాని దివంగత ఇందిర సాహసమే కారణమని అన్నారు.