మరిన్ని రాఫెళ్లు అందించడానికి సిద్దం

ప్రకటించిన ఫ్రాన్స్‌ ప్రభుత్వం

న్యూఢల్లీి,డిసెంబర్‌17(జనంసాక్షి): ఒకవేళ ఇండియా కోరితే మరిన్ని రాఫేల్‌ యుద్ధ విమానాలను అందించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఫ్రాన్స్‌ రక్షణ మంత్రి ప్లోరెన్స్‌ పార్లే తెలిపారు. రాఫెల్‌ యుద్ధ విమానాలు రెండు దేశాలకు నిజమైన సంపదగా, శక్తిగా ఉంటాయన్నారు. ప్రస్తుతం ఇండియాలో పర్యటిస్తున్న మంత్రి పార్లే విూడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రఫేల్‌ పట్ల ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ సంతృప్తి వ్యక్తం చేయడం సంతోషంగా ఉందని పార్లే అన్నారు. కోవిడ్‌ వేళ కూడా విమానాలను అందించడం గొప్ప అచీవ్‌మెంట్‌ అన్నారు. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌తో ఆమె సుదీర్ఘ చర్చల్లో పాల్గొనున్నారు. ఒప్పందం ప్రకారం షెడ్యూల్‌కు లోబడే 33 రాఫేల్‌ యుద్ధ విమానాలను ఇండియాకు అందించినట్లు గురువారం ఫ్రెంచ్‌ ఎంబసీ వెల్లడిరచింది. 36 రాఫేల్‌ యుద్ధ విమానాల కోసం 2016లో ఫ్రాన్స్‌తో ఇండియా ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. సుమారు 59వేల కోట్లకు ఆ ఒప్పందం కుదిరింది.