తెలంగాణ కాంగ్రెస్‌కు జవసత్వాలు

 


కొత్త రక్తం ఎక్కించేందుకు ప్రయత్నాలు
పిసిసి చీఫ్‌ రేవంత్‌ దూకుడు ఫలించేనా
హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనం సాక్షి)  :   ధాన్యం సేకరణపై కాంగ్రెస్‌ ఇటీవల గట్టిగానే పోరాడిరది. అలాగే ఆయా ప్రాంతాల్లో ఆందోళనలు నిర్వహించింది. పిసిసి చీఫ్‌గా రేవంత్‌ రెడ్డి బాధ్యతలు స్వీకరించాక గట్టిగానే ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్‌ సీనియర్లను కలుపుకుని ముందుకు సాగారు. అలాగే దీక్షలు, ఆందోళనలతో హల్‌చల్‌ చేశారు. మరోవైపు రాష్ట్ర కాంగ్రెస్‌ పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేసే దిశగా పార్టీ అధిష్ఠానం పావులు కదుపుతోందని సమాచారం. రాష్ట్ర పార్టీలో జవసత్వాలు నింపే సమర్థుడైన నేతగా రేవంత్‌ రెడ్డి ఇప్పటికే తనను తాను రుజువు చేసుకున్నారు. అధికార టిఆర్‌ఎస్‌ను ఎక్కడిక్కడ వివిధ సమస్యలపై నిలదీస్తున్నారు. రాష్ట్ర పార్టీ శ్రేణులను ఏకతాటిపై నడిపించడం కోసం పార్టీ ఇన్‌ఛార్జ్‌ మాణిక్కం ఠాగూర్‌తో కలసి ముందుకు సాగుతున్నారు. ఆయన కలపుకుని పోయే ప్రయత్నంలో ఉన్నా పార్టీలో కొంత వ్యతిరేకత తప్పడం లేదు. సీనియర్‌లను విశ్వాసంలోకి తీసుకుంటూనే జూనియర్‌లకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్థిక, అంగబలం కూడా నేతలకు ముఖ్యమే. కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ నిర్ణయమే శిరోధార్యమని అంటున్నా ప్రతి ఒక్కరూ తమకున్న ప్రత్యేకతను చాటేలా పోటీ పడుతున్నారు. రాష్ట్ర పార్టీని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాల్సిందే నని మరికొందరు సూచిస్తున్నారు. అన్ని జిల్లాల్లోనూ పార్టీని బలోపేతం చేసేలా సమర్థులైన నేతలకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. జిల్లా కాంగ్రెస్‌ కమిటీలను కూడా పునర్వ్యవస్థీకరించాల్సి ఉంది. మొత్తంగా కాంగ్రెస్‌లో మార్పులు తథ్యమని చెబుతున్నారు. నాయకుల సూచనలకు ప్రాధాన్యం ఇస్తారా? లేక ఎప్పటిలాగే హైకమాండ్‌ అభిప్రాయాన్ని రుద్దుతారా అన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. కాంగ్రెస్‌లో సాధారణంగా లోకల్‌ అభిప్రాయం కంటే ఢల్లీి నిర్ణయాలే ఎక్కువగా ప్రభావం చూపుతుంటాయి. అందుకే.. ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి కూడా ఢª`లలీ నిర్ణయల మేరకే ముందుకు సాగుతున్నారు. ఎమ్మెల్యే జగ్గారెడ్డి సైతం పీసీసీ చీఫ్‌ కు వ్యతిరేకంగా కొంత దూకుడుగా వ్యవహరించి వెనక్కి తగ్గారు. ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇదే వైఖరితో ఉన్నా మళ్లీ వెనక్కి తగ్గి కలిసి పోతున్నారు. కాకపోతే హైకమాండ్‌కు తలొగ్గుతామని అంటూనే ఎవరి ఎత్తుగడలు వారు వేస్తున్నారు కాంగ్రెస్‌ నాయకులు. తమకు ప్రాధాన్యం దక్కకపోతే దారి చూసుకునేందుకు చాలామంది కాంగ్రెస్‌ నేతలు సిద్దంగా ఉన్నారని అంటున్నారు. ఇకపోతే కాంగ్రెస్‌ను వీడిన నేతలను తిరిగి రప్పించే పనిలో పిసిసి చీఫ్‌
రేవంత్‌ ఉన్నారని సమాచారం. అయితే వీరంతా తిరిగి కాంగ్రెస్‌ గూటికి వస్తారా అన్నది అనుమానమే