ఉపాధ్యాయ సంఘాలతో సిఎస్‌ భేటీ


జిఓ అమలుపై ప్రతినిధులతో చర్చ

రంగారెడ్డి,డిసెంబర్‌16 (జనం సాక్షి): జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గురువారం ఆకస్మికంగా సందర్శించారు. జీ.ఓ. నెంబర్‌ 317 అమలుపై ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఉద్యోగుల కేటాయింపు పక్రియపై ఉపాధ్యాయ సంఘాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. బదిలీల పక్రియ పూర్తయిన వెంటనే ప్రమోషన్లు, బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు చీఫ్‌ సెక్రటరీని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకు వెళ్తానని సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ వారికి హావిూ నిచ్చారు. కార్యక్రమంలో రంగారెడ్డి కలెక్టర్‌ అమేయ్‌ కుమార్‌, అడిషనల్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌, తిరుపతి రావు ఉన్నారు.