ప్రాజెక్టుల కింది విడుదలకు అంచనా
సంగారెడ్డి,డిసెంబర్18 (జనంసాక్షి): యాసంగి సాగుకు ప్రాజెక్టుల నుంచి నీరందించేందుకు ఉన్ననీటిని పంపిణీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. సాధ్యమైనంత ఎక్కువ ఎకరాలకు నీరందించాలని మంత్రి సూచించడంతో అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకుని ఆ మేరకు సాగునీటిని విడుదల చేయాలని ఆదేశించారు. ఈ యాసంగిలో సింగూరు ప్రాజెక్టు, ఘణపురం ఆయకట్టు కింద సాగునీరందించే ఏర్పాట్లు చేస్తున్నారు. యాసంగిలో జలవనరుల నుంచి సాధ్యమైనంత ఎక్కువ ఎకరాలకు సాగునీరందించాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా చూస్తామని సూచించారు. సాగుకు నీరందించే విషయంలో వ్యవసాయ, నీటిపారుదల శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసేలా చూస్తున్నారు. ప్రణాళిక బద్ధంగా నీటి విడుదల ఉండాలని ఆదేశించారు.నల్లవాగు ప్రాజెక్టు ఆధునీకరణకు ఇటీవలే ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. ఆధునీకరణ చేపట్టాల్సి ఉండగా ప్రాజెక్టు నుంచి సాగునీటి విడుదలపై రైతుల నుంచి భిన్నాభిప్రాయాలు అభిప్రాయాలు వెల్లడవుతున్నాయి. కొందరు రైతులు క్రాప్ హాలిడే ప్రకటించి పనులు చేపట్టాలని, మరికొందరు పంటలకు నీరివ్వాలని కోరుతున్నారు. ఈ క్రమంలో రైతులకు ఇబ్బంది లేకుండా వారి అభిప్రాయం మేరకు నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు.