దాడులు చేస్తే ఫిర్యాదు చేయండి

వారికి అండగా ఉంటానన్న ఎంపి సుజనా

అమరావతి,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  విశాఖలో జగదీశ్వరుడు, ఒంగోలులో సుబ్బారావు గుప్తాపై దాడి ఘటనలు ఏపీలో జరుగుతున్న అరాచకానికి పరాకాష్ట అని బీజేపీ ఎంపీ సుజనా చౌదరి అన్నారు. ఈ దాడుల క్రమంలో జగన్‌ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం, మంత్రులు, ఎంపీల పేర్లతో బెదిరించడం, కబ్జాలకు పాల్పడడం రివాజుగా మారిందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలను ముఖ్యమంత్రి జగన్‌ తక్షణమే అరికట్టాలన్నారు. బాధితులు వేధింపులకు భయపడకుండా పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫిర్యాదుల కాపీలు తనకు పంపించాలన్నారు. బాధితులకు అండగా ఉంటానని సుజనా చౌదరి హావిూ ఇచ్చారు.