మంత్రి ఎర్రబెల్లిని అభినందించిన కేటీఆర్‌

హైదరాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఘన విజయం సాధించడం పట్ల మంత్రి కేటీఆర్‌ హర్షం వ్యక్తం చేశారు. అలాగే ఈ ఎన్నికలకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా ఇంచార్జిగా వ్యవహరించినపంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావును టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ అభినందించారు. మంత్రి ఎర్రబెల్లి మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరు మున్సిపాలిటీ సర్వ సభ్య సమావేశంలో అభివృద్ధి పనులను సవిూక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ ఎర్రబెల్లికి ఫోన్‌ చేశారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీ మెజారిటీ రావడం పట్ల అభినందించారు. అందరినీ సమన్వయం చేయడంలో మంత్రి ఎర్రబెల్లి మంచి కృషి చేశారన్నారు. ఇదే స్ఫూర్తి ని కొనసాగించాలని చెప్పారు.