చిత్తూరు, డిసెంబర్3 (జనం సాక్షి)
వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లంలో నిత్యావసర సరుకుల గోదాము శిథిలావస్థకు చేరుకుంది. ఇది పీఏసీఎస్ కు సంబంధించిన భవనంలో అద్దెకు గోదామును నిర్వహిస్తున్నారు. శుక్రవారం వెదురుకుప్పం జడ్పీటీసీ సభ్యులు చలంపాళ్యం సుకుమార్ ఈ గోదామును సందర్శించారు. డిప్యూటీ సీఎం కళత్తూరు నారాయణ స్వామి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు.