తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బాబు

అమరావతి ఉద్యమానికి హాజరైనట్లు వెల్లడి

అమరావతి,డిసెబర్‌17 (జనంసాక్షి):   5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల కోరిక అమరావతి అని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు పునరుద్ఘటించారు.. గత 45 రోజులుగా అలుపు సొలుపు లేకుండా అమరావతి ఏకైక రాజధాని కోసం వందల కిలోవిూటర్లు పాదయాత్ర చేసి తిరుపతి చేరుకున్న రైతులకు మద్దతిచ్చేందుకే తాను తిరుపతికి వచ్చిన్నట్లు వెల్లడిరచారు. అమరావతి మహోద్యమ సభకు తాను హాజరవుతున్నానని ప్రకటించారు. చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుమలలోని శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన విూడియాతో మాట్లాడారు. న్యాయస్థానం నుంచి దేవస్థానం పేరుతో రైతుల మహాపాదయాత్ర తుళ్లూరు నుంచి అలిపిరి వరకు కొనసాగగా మహాపాదయాత్ర ముగింపుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ నేడు తిరుపతిలో బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. ఈ సభకు వైసీపీ మినహా అన్ని పార్టీలకు ఆహ్వానం పంపారు. మరోవైపు సభకు వచ్చే టీడీపీ నాయకులను, కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. పలువురిని గృహ నిర్భందం చేయడం పట్ల జేఏసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.