సిద్దిపేట,డిసెంబర్24(జనం సాక్షి ): దుబ్బాకలో ఏర్పాటు చేసిన వంద పడకల ఆసుపత్రిని శనివారం రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రారంభిస్తారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఆస్పత్రి ప్రారంభ విశేషాలను స్థానిక ఎమ్మెల్యే రఘునందన్‌రావు తెలిపారు. దుబ్బాకలోని వంద పడకల ఆసుపత్రిలో పనులను వైద్యసిబ్బందితో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. రోగులకు మెరుగైన వైద్యసేవలను అందించాలనే లక్ష్యంతోనే వందపడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసినట్లు వెల్లడిరచారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ జ్యోతి ప్రారంభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.
నేడు దుబ్బాకలో వందపడకల ఆస్పత్రి ప్రారంభం