కేంద్ర,రాష్ట్ర సంబంధాలు మరింత బలపడాలి

  రాజకీయాలు వేరు..అభివృద్ది వేరు.. ఈ రెంటిని అనుసంధానిస్తూ ముందుకు సాగాలి. నీతి ఆయోగ్‌ ఏర్పాటు సందర్భంగా ప్రధాని మోడీ కూడా కేంద్ర రాష్ట్ర సంబంధాలపై కొత్త నిర్వచనం ఇచ్చారు. కానీ మోడీ అధికారంలోకి వచ్చాక రాష్టాల్రను విశ్వాసంలోకి తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. నిధుల కేటాయింపు మొదలు, అభివృద్ది పనులు కూడా పరస్పర విశ్వాసంతో కొనసాగించాలి. రాష్టాల్రు తప్పు దోవ పడుతున్న సందర్భంలో అవసరమైన మెచ్చరికలు కూడా చేయాలి. ఇదే సందర్భంలో తాజాగా మారిన రాజకీయాల క్రమంలో ఆయా రాష్టాల్ర ఆర్థిక స్తితిపైనా నీతి ఆయోగ్‌ ద్వారా హెచ్చరికలు చేయడం మంచిదే. ఇకపోతే సిఎంలుగా ప్రతి ఒక్కరూ ప్రధానితో నిరంతరం సవిూక్షించుకునే అవకాశాలు ఉండాలి. కనీసం ఒక్కో రాష్టాన్రికి ప్రధాని నెలలో ఒకరోజయినా సమయం కేటాయించి రాష్టాల్ర బాగోగులు, సమస్యలు చర్చించాలి. నీతి ఆయోగ్‌ సమావేశలను కూడా కనీసం మూడు నెలలకో మారయినా సమావేశ పరచి చర్చిస్తే మంచిది. ధాన్యం సేకరణ, నదీజలాల కేటాయింపు సమస్యలు,విద్యుత్‌ సమస్యలు, ప్రభుత్వరంగ సంస్థల అమ్మకాలు వంటివి ఏవైనా కేంద్రం కూడా పెద్దతరహాలో రాష్టాల్రను విశ్వాసంలోకి తీసుకోవాలి. అప్పుడే కేంద్ర రాష్టాల్ర మధ్య బంధం బలోపేతం అవుతుంది. పార్టీలు వేరయినంత మాత్రాన దేశం వేరు కాదన్న విషయం ఆయా రాష్టాల్ర సిఎంలు కూడా గమనించాలి. అలాగే కేంద్ర రాష్టాల్ర మధ్య ఉన్న అధికారిక సంబంధాలు వేరు. సిఎం కెసిఆర్‌ కావచ్చు..జగన్‌ కావచ్చు.. మమతా బెనర్జీ కావచ్చు..లేదా మరే ఇతర రాష్ట్ర సిఎం అయినా కావచ్చు పాలనాపరమైన విషయాల కోసం కేంద్రంతో నిత్యం సంబంధాలు నెరపాల్సిందే. హస్తినకు వెళ్లాల్సిందే. పార్టీలు ఏవైనా అధికారంలో ఉన్నది ఎవరైనా కేంద్రంతో నిరంతరాయంగా అనుసంధానం అవుతూనే ఉండాలి. ఏ ముఖ్యమంత్రి అయినా

ఢల్లీి పర్యటనకు వెళ్లడం వంటివి రాజకీయ కోణంలో చూడరాదు. నిజానికి వారు మాట్లాడుకోవాల్సి వస్తే మనకు తెలియుకుండానే మాట్లాడుతారు. తమ పాలసీకి అనుగుణంగా నడుస్తారు. ఎవరైనా సిఎం ఢల్లీి వెళితే కేంద్రంతో రాజకీయ సంప్రదింపులకు వెళ్లాడని ఆరోపించడానికి లేదు. ఫెడరల్‌ వ్యవస్థలో సిఎంలు ప్రధానిని ,కేంద్ర మంత్రులను, కేంద్ర అధికారులను కలవడ్‌ సర్వసాధారణం. ఇది విమర్శించే రాజకీయ పార్టీలు గుర్తించాలి. ఇకపోతే తెలుగు రాష్టాల్ల్రో సిఎంలుగా ఉన్న కెసిఆర్‌, జగన్‌లు తమకు అనుకూలమైన పద్దతిలోనే పాలన చేస్తున్నారే తప్ప ఎలాంటి విమర్శలకు జడవడం లేదు. అయితే కెసిఆర్‌ రాజకీయంగా ఎత్తులు వేయడంలో దిట్ట. ఆయన రాజకీయ సోపానపటం పరిశీలిస్తే నిచ్చెన మెట్లు ఎక్కడమే తప్ప దిగడం తెలియదు. అలాంటి సమయంలో ఇటీవలి హుజూరాబాద్‌ ఫలితం కావచ్చు..ఆయనకో లెక్క కాదు. అలాగే ఆయన కూడా వీటిని పెద్దగా సీరియస్‌గా తీసుకుంటున్నట్లు కనిపించడం లేదు. అంతా తనకే తెలుసు అన్న ధరోణిలో కెసిఆర్‌ ఉంటారు. జాతీయస్థాయిలో కాంగ్రెస్‌, బిజెపిలను ఢీ కొంటానని ప్రకటనలు చేసినందున బీజేపీతో అంటకాగుతారనడానికి లేదు. అలాగే బిజెపి కూడా ఆయనను టార్గెట్‌ చేయడానికి ఉన్న అవకాశాలను వెతుకుతూనే ఉంటుంది. కేసీఆర్‌ ప్రభుత్వంలో అవినీతి ఎక్కడెక్కడ జరిగింది అని కమలనాథులు ఆరా తీయడం మొదలు పెట్టారనే అంటున్నారు. బలమైన ఆధారాలు లభిస్తే కేసీఆర్‌ను, జగన్ను లేదా మమతా బెనర్జీల్లో ఎవరిని కూడా కమలనాథులు వదలరు. కేసుల్లో ఇరికించి మరింత బలహీనపరిచే ఎత్తుగడలకు బీజేపీ నాయకులు పదును పెడుతూనే ఉంటారు. ఇటీవలి హుజూరాబాద్‌ ఎన్నికల ఫలితంతోనే తెలంగాణలో ఇప్పుడు కేసీఆర్‌కు ప్రతికూల పరిస్థితులు నెలకొన్నా యని నిర్ధారించడానికి లేదు. ఎందుకంటే 12 ఎమ్మెల్సీ స్థానాలను గంపగుత్తగా గెల్చుకున్నారు. ఆరు
ఏకగ్రీవం కాగా..మరో ఆరు ఎన్నికలు జరిగినా గెలిచారు. ప్రజలు ఎప్పుడు ఎవరిని ఎలా ఆదరిస్తారో గతానుభవాలను బట్టి తెలుసుకోవచ్చు. తెలంగాణలో పంచాయతీ ఎన్నికలైనా, మునిసిపాలిటీ ఎన్నికలైనా, అసెంబ్లీ ఎన్నికలైనా కారుదే విజయం. ఎన్నిక ఏదైనా వార్‌ వన్‌సైడ్‌’ అంటూ తెలంగాణ రాష్ట్రసమితి నాయకులలో ఎమ్మెల్సీ ఫలితాలు ఆత్మవిశ్వాసం నింపిందనే చెప్పాలి. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు అజేయుడిగా ఉంటూ వచ్చిన కేసీఆర్‌ను అప్పుడప్పుడూ కొంత చికాకు కలవర పరిచినా విజయాలు పలకరి వస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చొరవ తీసుకున్న కాంగ్రెస్‌ పార్టీ నిస్సహా యంగా నిలబడిరది. తెలంగాణలో తృతీయ స్థానంలో ఉన్న భారతీయ జనతాపార్టీ ఏడున్నర ఏళ్లు గడిచేసరికి కేసీఆర్‌కు పెనుసవాలుగా ఎదిగింది. తెలంగాణ రాష్ట్రసమితిని ఇంటిపార్టీగా ప్రచారం చేసి, రాష్ట్రంలో మరో రాజకీయ పార్టీ అవసరం ఉందా? అని ప్రశ్నిస్తూ వచ్చిన కేసీఆర్‌కు ఇప్పుడు బిజెపి సవాల్‌గా నిలిచింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల విముఖత ఏర్పరుచుకున్న ప్రజలు బీజేపీలో ప్రత్యామ్నా యాన్ని చూడటం మొదలుపెట్టారు. కేసీఆర్‌ను దెబ్బ కొట్టాలంటే బీజేపీని ఆశ్రయించక తప్పని పరిస్థితి తెలంగాణలో ఏర్పడిరదన్న భావన ఏర్పడిరది. ఇదంతా రాజకీయ పోరాటం. ఈ దశలో కెసిఆర్‌ ధాన్యం సేకరణ సహా అనేక విషయాల్లో పోరాడుతూనే ఉన్నారు. అసవరమైన సందర్భాల్లో ఢల్లీి వెళ్లి చర్చిస్తూనే ఉన్నారు. ఇకపోతే పలు పెండిరగ్‌ ప్రాజెక్టులు, జిఎస్టీ నిధుల విడుదలకు సంబంధించి కేంద్రంతో సమస్యలు ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కూడా పరిష్కరించుకోవడం సిఎంగా కెసిఆర్‌ కర్తవ్యం. ఇవన్నీ చక్కబెట్టుకోవడం కోసం ఢల్లీికి వెళ్లాల్సిందే. అంతమాత్రాన కెసిఆర్‌ భయపడి ఢల్లీికి వెళ్లారని, బిజెపి నేతల కాల్లు పట్టుకోవడానికే అని ప్రచారం చేయడం సరికాదు. రాజకీయాల్లో ఎంతోకాలంగా ఉంటున్న వారే ఇలాంటి ప్రచారం చేయడం రాజకీయ ప్రచారానికి కూడా పనికి రాదని గుర్తిస్తే మంచిది. కేంద్ర రాష్ట్ర సంబంధాలు వేరు..రాజకీయ పోరాటాలు వేరని గుర్తించాలి. రాష్టాల్రకు సంబంధించి అనేక సమస్యలను ఎప్పుడూ నిలదీయడంలోనూ వెనకడుగు వేయరాదు.