జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు రంగం సిద్దం

జనవరి 14 నుంచి 18 వరకు పోటీలు

ఏలూరు,డిసెంబర్‌24(జనం సాక్షి): నరసాపురం పట్టణంలో జనవరి 14 నుంచి 18 వరకు మహిళలు, పురుషుల విభాగాల్లో జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించనున్నారు. గోగులమ్మ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జరిగే పోటీల్లో పురుషుల విభాగంలో ఢల్లీి, ఆంధ్ర, తెలంగాణ, చంఢీఘర్‌, హర్యాన, యూపీ, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్‌, బెంగాల్‌ పోలీస్‌, ఏఓసీ హైదరాబాద్‌, బీహార్‌, విదర్భ రాష్టాల్ర జట్లు పాల్గొంటాయని నిర్వాహకులు అన్నారు. మహిళల విభాగంలో ఢల్లీి, పుదుచ్చేరి, ఒడిశా, తెలంగాణ, ఆంధ్ర, కేరళ, కర్నాటక, యూపీ, హర్యానా జట్లు తలబడతాయన్నారు. లీగ్‌ కమ్‌ నాకౌట్‌ పద్ధతిలో జరిగే పోటీల్లో విజేతలకు రూ.5 లక్షలు ప్రైజ్‌ మనీ నిర్ణయించా మన్నారు. మొదటి జట్టుకు రూ.లక్ష, ద్వితీయ రూ.75 వేలు, తృతీయ రూ.50 వేలు, నాలుగో స్థానంలో నిలిచిన జట్టుకు రూ.25వేలు ఇస్తామన్నారు. జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన క్రీడాకారులు కూడా వస్తారన్నారు. ఫెడరేషన్‌ నుంచి 60 మంది రిఫరీలు పోటీలను పర్యవేక్షిస్తారన్నారు.