టిఆర్‌ఎస్‌కు తిరుగులేదు: జీవన్‌ రెడ్డి


నిజామాబాద్‌,డిసెంబర్‌14 (జనంసాక్షి ) : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయంపై ఆర్మూర్‌ ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి స్పందించారు. టీఆర్‌ఎస్‌కు తిరుగే లేదని... ఇది అఖండ విజయమని అన్నారు. టీఆర్‌ఎస్‌ అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని తెలిపారు. మరోసారి అప్రతిహత విజయంతో చాటి చెప్పామన్నారు. తెలంగాణ రాష్ట్ర యావత్తు ప్రజానీకం టీఆర్‌ఎస్‌, ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉన్నారని జీవన్‌ రెడ్డి అన్నారు. 12 స్థానాలను గెల్చుకోవడం ద్వారా కాంగ్రెస్‌, బిజెపిలకు స్థానం లేదని నిరూపించామని అన్నారు. మండలిలో సీటు లేకుండా పోయిన బిజెపికి గట్టి గుణపాఠం అన్నారు. ఇది గమనించి ఇకముందు మాట్లాడాలని అన్నారు.