గుంటూరు,డిసెంబర్3 (జనంసాక్షి) : వ్యాక్సిన వేయించుకుంటే పిల్లలు పుట్టరనీ, గర్భం దాల్చరనీ, వీర్య కణాలు తగ్గిపోతాయని ఇతర వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఇలా అనేక అపోహలు ఉన్నాయి. దీంతో చాలామంది వ్యాక్సిన వేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదని వైద్యవర్గాలు చెబుతున్నాయి. వ్యాక్సినేషన ప్రారంభించి 10 నెలలు దాటిని లక్షల మంది ఒక డోసు టీకా కూడా వేయించుకోలేదని గణాంకాలు చెబుతున్నాయి. అవగాహన కల్పించడంలో అధికారుల వైఫల్యం కూడా కనిపిస్తోంది. చాలామంది అపోహల వల్లే టీకా వేయించుకోవడానికి ముందుకు రావడం లేదని వైద్యాధికారులు చెబుతున్నారు. కూలికెళ్లేగానీ పూటగడవని వారు టీకా వేయించుకుంటే జ్వరాలు వస్తాయనీ, నొప్పులు ఉంటాయని కూలికెళ్లడానికి కుదరదన్న అపోహలతో టీకాకు దూరంగా ఉంటున్నట్లు చెబుతున్నారు. వైద్యవర్గాలు ఈ అపోహలను తొలగించడంలో విఫలమయ్యారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రజల్లో వ్యాక్సినేషన్ భయాలు ముందుకు రావడం లేదంటున్న అధికారులు