ధాన్యం సేకరణలో ప్రణాళిక లేని కేంద్రం


తెలంగాణ పట్ల కేంద్రం వివక్షచూపుతోంది

మండిపడ్డ టిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు
హైదరాబాద్‌,డిసెంబర్‌18 (జనంసాక్షి):   ధాన్యం ఎగుమతిపై కేంద్రానికి ప్రణాళిక లేదని ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి విమర్శించారు. తెలంగాణ రైతుల ధాన్యం తీసుకోకుండా కేంద్రం కుట్ర చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ రైతులు పండిరచిన మొత్తం ధాన్యాన్ని కొంటామని కేంద్ర ప్రభుత్వం తక్షణమే పార్లమెంటులో ప్రకటన చేయాలని డిమాండ్‌ చేశారు. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యతో కలిసి అసెంబ్లీలోని టీఆర్‌ఎస్‌ శాసనసభా పక్ష కార్యాలయంలో విూడియాతో మాట్లాడారు. కేంద్రంలోని మంత్రులు అబద్దాలవిూదనే బతుకున్నారని విమర్శించారు. ఇక్కడి రైతులు రైతులు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణపై ఎందుకు వివక్ష చూపుతున్నారో ప్రధాని మోదీ ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కరువు కాటకాలతో వలసలు పోయిన రైతులు? ఇప్పుడిప్పుడే స్వస్థలాలకు చేరుకుని కుదురుకుంటున్నారని, ఆరుగాలం శ్రమించి పంటలు పండిస్తున్నారని కుటుంబాలను నిలబెట్టుకుంటున్నారని చెప్పారు. రైతులు పండిరచిన పంటల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం బాధ్యతా రాహిత్యంగా వవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వ చర్యలతో తెలంగాణ రైతాంగం ఆందోళనలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ రైతులు, ప్రజల పట్ల పూర్తిగా ప్రధాని వివక్ష చూపుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ చేపట్టిన అనేక కార్యక్రమాలతో నీళ్లు రావడంతోపాటు భూగర్భ జలాలు పెరిగాయని, ప్రభుత్వం రైతుబంధు ఇస్తుండటంతో రైతులు చాలా సంతోషంగా ఉన్నారని చెప్పారు. ధాన్యం సేకరించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యతేనని స్పష్టం చేశారు. బీజేపీ రైతులతో రాజకీయాలు చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 20న తెలంగాణ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని చెప్పారు. ధాన్యం కొనేవరకు పోరాటం చేస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి గోరి కట్టడం ఖాయన్నారు. వానాకాలం కొనుగోలు విషయంలో కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ నేటితో అయిపోతున్నదని, అయినప్పటికీ ధాన్యం ఇంకా కళ్లాల్లోనే ఉందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య అన్నారు. మిగిలిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇవాళ మంత్రుల బృంధం ఢల్లీికి వెళ్తున్నదని, కేంద్ర మంత్రులను కలసి వినతి పత్రం ఇవ్వనున్నారని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు చట్టాలకు తీరుకు నిరసనగా ఢల్లీిలో రైతులు నిరసనలు చేశారు దెబ్బకు మోదీ దిగివచ్చి క్షమాపణ చెప్పాడన్నారు.