ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ఉమ్మడి నల్లగొండ జిల్లా


ఎమ్మెల్సీ ఫలితంపై మంత్రి జగదీశ్‌ రెడ్డి

నల్లగొండ,డిసెంబర్‌14(జనంసాక్షి ): ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎంసీ కోటిరెడ్డి విజయం సాధించడంపై మంత్రి జగదీశ్‌ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఈ ఎన్నిక ఫలితంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా అంతా సీఎం కేసీఆర్‌ వెంటే నడుస్తోందని మరోసారి స్పష్టమైందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోటిరెడ్డి గెలుపునకు సహకరించిన ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు, పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టామన్నారు. ఈ విజయంతో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ పార్టీ బలోపేతమైన శక్తిగా మారిందని జగదీశ్‌ రెడ్డి పేర్కొన్నారు.