చిన్నారితో చెరువులో దూకి మహిళ ఆత్మహత్య

మహబూబ్‌నగర్‌,డిసెంబర్‌2 : మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మిడ్జిల్‌లో విషాదం చోటుచేసుకుంది. తొమ్మిది నెలల కుమార్తెతో సహా చెరువులోకి దూకి మహిళ ఆత్మహత్య చేసుకున్నది. మిడ్జిల్‌కు చెందిన సరిత అనే మహిళ.. రెండు రోజుల క్రితం కుమార్తెను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో గురువారం ఉదయం గ్రామ శివార్లలోని చెరువులో ఇరువురు విగతజీవులుగా కనిపించారు. దీంతో చెరువులోనుంచి మృతదేహాలను స్థానికులు వెలికితీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు.