358కి చేరిన కేసుల సంఖ్య
న్యూఢల్లీి,డిసెంబర్24(జనం సాక్షి): దేశవ్యాప్తంగా కరోనా కొత్త వేరియెంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తోంది. తాజాగా ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య 358కి చేరింది. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 100కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇప్పటి వరకు మహారాష్ట్రలో అత్యధికంగా 88 మంది ఒమిక్రాన్ బారినపడ్డారు. 67 కేసులతో ఢల్లీి రెండో స్థానంలో ఉంది. తెలంగాణలో 38, తమిళనాడు 34, కర్నాటక 31, గుజరాత్ 30, కేరళ 27, రాజస్థాన్ 22, హర్యానా, ఒడిశాల్లో 4, జమ్మూకాశ్మీర్, బెంగాల్ లో 3, ఏపీ, యూపీల్లో 2, చండీఘడ్, లద్దాఖ్, ఉత్తరాఖండ్ లలో ఒక్కో కేసు చొప్పున నమోదయ్యాయి. ఒమిక్రాన్ బారినపడ్డ వారిలో ఇప్పటి వరకు 114 మంది కోలుకున్నారు. తమిళనాడులో గురువారం రికార్డు స్థాయిలో 33 కొత్త ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలో 23 మందికి ఒమిక్రాన్ ఉన్నట్లు తేలింది. వారిలో 17మందిలో ఎలాంటి లక్షణాలు లేవు. పేషెంట్లలో నలుగురు 18ఏళ్లలోపు వారున్నారు. కర్నాటకలో నిన్న 12 కేసులు రాగా వారిలో 10 బెంగళూరులోనే నమోదయ్యాయి. మిగిలిన ఇద్దరు మైసూరు, దక్షిణ కన్నడ ప్రాంతాలకు చెందినవారు. ఇదిలావుంటే ఒమిక్రాన్ వేరియంట్ కేసులు విపరీతంగా పెరుగుతుండడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ విధించింది. ప్రతిరోజూ రాత్రి 11 గంటల నుంచి మర్నాడు తెల్లవారు జాము 5 గంటల వరకు కర్ఫూ కొనసాగుతుందని ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రకటించారు. తాజాగా 23 మంది కరోనా వైరస్‌కు గురికావడంతో మొత్తం కేసుల సంఖ్య 7,93,532 కు చేరుకుంది. అంతేకాదు ఒకరు మృతి చెందడంతో మృతుల సంఖ్య 10,530 కి చేరింది. మహారాష్ట్ర, గుజరాత్, ఢల్లీి రాష్టాల్ర నుంచి మధ్యప్రదేశ్‌కు వచ్చేవారు ఎక్కువగా ఉండడం, కేసులు పెరుగుతుండడంతో ఈమేరకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే 16 రాష్టాల్రకు విస్తరించిన ఒమిక్రాన్ మధ్యప్రదేశ్‌లో కూడా విస్తరించే ప్రమాదం ఉందని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు.
దేశంలో విజృంభిస్తున్న ఒమిక్రాన్