వేగంగా చెట్టును ఢీకొన్న కారు

ఒకరు మృతి..మరో నలుగురికి తీవ్ర గాయాలు

మేడ్చల్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జీహెచ్‌ఎంసీ శివార్లలోని బహదూర్‌పల్లి వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఆదివారం అర్ధరాత్రి వేగంగా దూసుకొచ్చిన కారు మైసమ్మ గూడ వద్ద అదుపుతప్పి చెట్టుకు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతిచెందగా, మరో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు.
బహదూర్‌పల్లి నుంచి దూలపల్లికి వెల్తుండగా ప్రమాదం జరిగిందన్నారు. మృతుడు బహదూర్‌పల్లికి చెందిన బాలకృష్ణగా గుర్తించారు. ఈ ఘటనపైన కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.