ఇంటర్‌ ఫస్టియర్‌ బాలికలకు సన్మానం

నిజామాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి ): జిల్లాలోని డిచ్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మల్టీపర్సస్‌ హెల్త్‌ వర్కర్‌ ఫీమేల్‌ గ్రూప్‌ నుంచి వసంత అనే విద్యార్థిని 500ల మార్కులకుగాను 475 సాధించి మొదటి ర్యాంకు సాధించగా 474 మార్కులతో సవిత 2వ ర్యాంకు సాధించిందని డీఐఈవో తెలిపారు. భీమ్‌గల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల విద్యార్థిని అరేబియన్‌ మిర్జా 440 మార్కులకు గాను 424 సాధించి రాష్ట్రస్థాయిలో బైపీసీలో 5వ ర్యాంకు సాధించడంతో డీఐఈవో రఘురాజ్‌, కళాశాల ప్రిన్సిపాల్‌ సన్మానించారు. నిజామాబాద్‌ ప్రభుత్వ బాలికల జూనియర్‌ కళాశాల ఎంపీసీ ఇంగ్లీష్‌ విూడియంలో వైష్ణవి 453 మార్కులు సాధించిందని, మల్టీపర్పస్‌ హెల్త్‌ వర్కర్‌ ఫీమేల్‌ గ్రూప్‌లో ప్రవళిక 463 మార్కులు సాధించినట్లు తెలిపారు.