ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌

  


` కొద్ది సమయం పాటు హ్యాక్‌ అయినట్లు ప్రధాని కార్యాలయం ప్రకటన
దిల్లీ,డిసెంబరు 12(జనంసాక్షి): ప్రధాని మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతా కొద్ది సమయం హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం పేర్కొంది. అయితే కొంతసేపటి తర్వాత ట్విటర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది. మోదీ వ్యక్తిగత ట్విటర్‌ ఖాతాలో అగంతకులు బిట్‌కాయిన్‌ను ఉద్దేశిస్తూ పోస్టు చేశారు. భారత్‌లో బిట్‌కాయిన్‌ను లీగల్‌ చేశారని, ప్రభుత్వం 500 బిట్‌కాయిన్‌లు కొనుగోలు చేసి,ప్రజలకు పంచుతోందని హ్యాకర్లు లింక్‌లు పోస్టు చేశారు. దీంతో వెంటనే పీఎంవో అధికారులు స్పందించి ట్విటర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ఆ ట్వీట్‌ను తొలగించారు. అనంతరం ట్విటర్‌ ఖాతాను పునరుద్ధరించారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఈ సమయంలో ప్రధాని కార్యాలయం ట్వీట్‌ చేసింది. ప్రధాని మోదీ ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయిందని, ఆ ఖాతాలో ఏవైనా ట్వీట్‌లు పోస్టులు చేస్తే స్వల్పకాలం పాటు స్పందించవద్దని పేర్కొంది.