ఒమిక్రాన్‌తో ఆస్పత్రులకు వెళ్లే రిస్క్‌ తక్కువే

 


కొత్త వేరియంట్‌ కట్టడికి ఫైజర్‌ టాబ్లెట్స్‌
అత్యవసర వినియోగానికి అమెరికా అనుమతి
వాషింగ్టన్‌,డిసెంబర్‌23 (జనం సాక్షి) : ఓ వైపు కరోనా వైరస్‌ ఉధృతి తగ్గుముఖం పడుతోంది.. మరోవైపు కరోనా వైరస్‌ కొత్త వేరియంట్‌ షరవేగంగా వ్యాపిస్తోంది. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ పై కరోనా కట్టడి కోసం తాము తయారు చేసిన యాంటీ వైరల్‌ డ్రగ్‌ కూడా పనిచేస్తుందని అమెరికన్‌ కు చెందిన ఫైజర్‌ కంపనీ ప్రకటించింది. తాము ఈ మేరకు ఇప్పటికే సుమారు 2,250 మందిపై ఫైర్‌ టాబ్లెట్స్‌ ను ప్రయోగించినట్లు.. అవి సత్ఫలితాలను ఇచ్చినట్లు .. హై రిస్క్‌ ఉన్న వారిలో కూడా ఆస్పత్రిలో చేరే ప్రమాదం నుంచి తగ్గించినట్లు వెల్లడిరచింది. తాము తమ ట్యాª`లబెట్లతో టీకాలు వేసు కోని పెద్ద వయసు ఉన్నవారిపైనా, అస్తమా, ఒబెసిటీ వంటి ఆరోగ్య సమస్యలు ఉవారివైపునా ట్రయల్స్‌ వేసినట్లు ప్రకటించింది. ఒమిక్రాన్‌ లక్షణాలు కనిపించిన వెంటనే ్గªజైర్‌ మందులను ఉపయోగించినవారు త్వరగా కోలుకున్నట్లు తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొంది. అంతేకాదు ల్యాబ్‌లో కూడా నిర్వహించిన పరీక్షల్లో కూడా ఫైజర్‌ పనిచేతున్నట్లు వెల్లడైందని తెలిపింది. ఒమిక్రాన్‌ వేరియంట్‌ రిప్రొడక్షన్‌ కోసం ఉపయోగించే కీలకమైన ప్రొటీన్‌ ను సింథటిక్‌ గా తయారు చేసి టెస్టు చేసినట్లు.. అది ఒమిక్రాన్‌ ను సమర్ధవంతంగా అడ్డుకున్నట్లు ్గªజైర్‌ సంస్థ ప్రకటించింది. తమ మెడిసిన్‌ హైరిస్క్‌ పేషెంట్లలో 30 శాతం ముప్పు తగ్గిస్తుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ రెండు కంపెనీలు ఇప్పటికే అమెరికా ఫుడ్‌ అండ్‌ డ్రగ్స్‌ అడ్మినిస్టేష్రన్‌ (ఎప్డీఏ) అనుమతుల కోసం దరఖాస్తు చేసుకున్నాయి. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్‌? బాధితుల సంఖ్య పెరగొచ్చు ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే ప్రకటించింది. అంతేకాదు చిక్తిస కోసం ఆస్పత్రిలో చేరే వారి సంఖ్య భారీగా ఉండవచ్చునని? మరణాలు కూడా పెరగవచ్చు అని అంచనా వేస్తోంది. ఒమిక్రాన్‌ ఇప్పటిదాకా 63 దేశాలకు వ్యాపించినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఫైజర్‌ పిల్‌ ’పాక్స్‌లోవిడ్‌’కు ఆమోద ముద్ర వేసింది. అధికంగా ప్రభావితమయ్యే 12 ఏళ్లు ఆపైబడిన వారికి ఈ పిల్‌ వినియోగించవచ్చు. రెండు రకాలైన టాబ్లెట్స్‌తో కూడిన ఈ ఫాక్స్‌లోవిడ్‌ను ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌
అడ్మినిస్టేష్రన్‌ (ఎఫ్‌డిఎ) అత్యవసర వినియోగానికి ఆమోదించింది. ఆసుపత్రికి వెళ్లే పరిస్థితులతో పాటు.. మరణాల ప్రమాదాన్ని 88 శాతం తగ్గించినట్లు క్లినికల్‌ ట్రయల్‌లో తేలడంతో ఈ పిల్‌కు గ్రీన్‌ సిగల్‌ లభించింది. ఈ చర్య సైన్స్‌ శక్తికి, ఆమెరికా ఆవిష్కరణ, తెలివికి నిదర్శనమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఓ ప్రకటనలో తెలిపారు. ్గªజైర్‌ ఉత్పత్తిని పెంచడంలో సహాయపడే చట్టాలన్ని తెస్తామని హామనిచ్చారు. 10 మిలియన్ల కోర్సులను నిమిత్తం 5.3 బిలియన్‌ డాలర్లను ఖర్చు పెట్టనుంది. తొలి విడతలో భాగంగా జనవరిలో 2,65,000 పిల్స్‌ పంపిణీ అవుతాయి. వేసవి చివరి నాటికి మిగిలినవి అందుబాటులోకి వస్తాయని వైట్‌హౌస్‌ కోవిడ్‌ కోఆర్డినేటర్‌ జెఫ్‌ జియంట్స్‌ తెలిపారు.