తెలంగాణలో పెరుగుతున్న ఒమిక్రాన్‌ కేసులు

హైదరాబాద్‌,డిసెంబర్‌21( జనం సాక్షి): రాష్ట్రంలో ఒమిక్రాన్‌ కేసులు, అనుమానితుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో 20 మంది ఒమిక్రాన్‌ బాధితులు ఉన్నారు. గచ్చిబౌలి టిమ్స్‌లో ఒమిక్రాన్‌ బాధితులతో పాటు, అనుమానితులు 40 మంది వరకు ఉన్నారు. శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌లో చేసిన టెస్టుల్లో మరో 9 మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో వారిని కూడా టిమ్స్‌ కు తరలిస్తున్నారు హెల్త్‌ సిబ్బంది. రిస్క్‌ కంట్రీస్‌ నుంచి వచ్చే వారికే కాకుండా.. నాన్‌ రిస్క్‌ కంట్రీస్‌ నుంచి వచ్చే వారికి కూడా కరోనా టెస్ట్‌ లు చేస్తున్నారు. ఎయిర్‌ పోర్ట్‌ లో నెగిటివ్‌ వచ్చిన వారికి... 8 వ రోజు మళ్లీ టెస్టులు చేస్తున్నారు. కొంతమందిలో 8 వ రోజు వైరస్‌ బయట పడుతున్నట్టు సమాచారం. 15 శాంపిల్స్‌ జినోమ్‌ రిపోర్ట్స్‌ వెయిటింగ్‌ లో ఉన్నట్టు తెలుస్తోంది.