విడతల వారిగా ఇళ్లు మంజూరు

శరవేగంగా డబుల్‌ ఇళ్ల నిర్మాణాలు

ఖమ్మం,డిసెంబర్‌18 (జనంసాక్షి): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్‌బెడ్‌రూం పథకంలో భాగంగా ఇళ్లను నాణ్యతా ప్రమాణాలు పాటించి నిర్మించడం జరుగుతుందని మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. దశలవారీగా పేదలందరికీ ఇళ్లు నిర్మిస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్న డబుల్‌బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం జోరుగా సాగుతోందని అన్నారు. విడతల వారిగా డబుల్‌ ఇళ్లను నిర్మించేందుకు సిద్ధమైంది. త్వరలోనే ఇళ్ల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి పూర్తిచేసి లబ్దిదారులకు అందజేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. రైతుల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, రైతుల అభ్యున్నతి కోసం ప్రభుత్వం పాటుపడుతుందని అన్నారు. రైతులను దళారులను నమ్మి మోసపోకుండా ఉండేందుకు కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధర కల్పిస్తుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులను
రాజును చేయడమే ధ్యేయంగా రైతుబంధు, బీమా పథకాలతో పాటు గిట్టుబాటు ధర కల్పించిందన్నారు.