పొట్టి శ్రీరాములుకు సీఎం జగన్‌ నివాళి

అమరావతి,డిసెంబర్‌15 (జనంసాక్షి):-   అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాళులు అర్పించారు. బుధవారం తాడేపల్లి సీఎం క్యాంప్‌ కార్యాలయంలో సీఎం వైఎస్‌ జగన్‌.. పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అదే విధంగా భారతరత్న సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ వర్ధంతి సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.