నేడు తమిళనాడుకు సీఎం కేసీఆర్‌

  

` శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకోనున్న ముఖ్యమంత్రి
` నేడు రాత్రి చెన్నైలోనే బస
హైదరాబాద్‌,డిసెంబరు 12(జనంసాక్షి):రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సోమవారం తమిళనాడు పర్యటనకు వెళ్లన్నారు. కుటుంబ సమేతంగా శ్రీరంగంలోని రంగనాథస్వామి వారిని దర్శించుకోనున్నారు. ఉదయం 11.10 గంటల సమయంలో బేగంపేట నుంచి ప్రత్యేక విమానంలో తిరుచిరాపల్లి విమానాశ్రయం చేరుకుంటారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా అక్కడి నుంచి ఎస్‌ఆర్‌ఎం హోటల్‌కు చేరుకొని, మధ్యాహ్నం 3 గంటల సమయంలో రంగనాథస్వామి వారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత విమానాశ్రయం వెళ్లి అక్కడి నుంచి చెన్నైకి చేరుకుంటారు. రాత్రి చెన్నైలోనే బస చేస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.