భారత్‌ భామ విశ్వసుందరి టైటిల్‌ కైవసం

`


మిస్‌ యూనివర్స్‌గా హర్నాజ్‌ సంధు

న్యూఢల్లీి,డిసెంబరు 13(జనంసాక్షి): మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని భారత యువతి సొంతం చేసుకున్నది. ఇజ్రాయెల్‌లో జరుగుతున్న 70వ మిస్‌ యూనివర్స్‌`2021 పోటీల్లో పంజాబ్‌కు చెందిన 21 ఏండ్ల హర్నాజ్‌ కౌర్‌ సంధు టైటిల్‌ను గెలుపొందింది. దీంతో 21 ఏండ్ల తర్వాత భారత్‌కు మిస్‌ యూనివర్స్‌ కిరీటం దక్కినట్లయింది.మొదటిసారిగా 1994లో సుస్మితా సేన్‌ విశ్వ సుందరి కిరీటాన్ని ధరించింది. తర్వాత 2000 సంవత్సరంలో లారాదత్తా ఈ టైటిల్‌ను సొంతం చేసుకున్నది. మళ్లీ సరిగ్గా 21 ఏండ్ల తర్వాత అందులోనూ 2021లో 21 ఏండ్ల హర్నాజ్‌ సంధుకు ఈ కిరీటం దక్కడం విశేషం.ఇజ్రాయెల్‌లోని ఐలాట్‌లో జరిగిన ఈ పోటీలో పరాగ్వే, దక్షిణాఫ్రికాకు చెందిన యువతులతో హర్నాజ్‌ సంధు పోటీపడిరది. వారిపై నెగ్గిన హర్నాజ్‌కు మెక్సికోకు చెందిన మాజీ మిస్‌ యూనివర్స్‌ 2020 ఆండ్రియా మెజా మిస్‌ యూనివర్స్‌ కిరీటాన్ని ధరింపజేసింది.కాగా హర్నాజ్‌ సంధు విశ్వసుందరి పోటీల్లో తన పదునైన సమాధానాలతో ఆకట్టుకున్నది. విూపై విూరు నమ్మకం ఉంచుకోండి అన్న ఆమె డైలాగ్‌.. విశ్వవేదికపై ఆమెను సుందరిని చేసేసింది. నేటి రోజుల్లో వత్తిళ్లను ఎదుర్కొనేందుకు యువ ఆడపడుచులకు ఎటువంటి సలహా ఇస్తారని జడ్జిలు ఆమెను అడిగారు. ఆ సమయంలో హర్నాజ్‌ సంధు చాలా బలమైన సమాధానం ఇచ్చింది. తమపై తమకు నమ్మకం లేకపోవడమే నేటి యువతకు పెద్ద సమస్యగా మారిందని, అయితే విూరే విశిష్టమైన వాళ్లన్న అంశాన్ని గ్రహించడమే కీలకమని, ఇతరులతో పోల్చడం మానుకోవాలని, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ముఖ్య అంశాల గురించి మాట్లాడుకోవాలన్నారు. బయటకు వచ్చి.. విూ మనసులోని భావాల్ని చెప్పండని సంధు సలహా ఇచ్చారు. విూ జీవితానికి విూరే లీడర్‌ అని, విూ మాటకు విూరే కీలకమని, నాకు నాపై నమ్మకం ఉందని, అందుకే నేను ఇక్కడ ఈ పోటీల్లో నిలుచున్నానని హర్నాజ్‌ తెలిపింది. సంధు అని అడిగిన ప్రశ్నకు సంబంధించిన వీడియో ఇదే. ఒకసారి లుక్కేయండి.