ఉజ్జయిని మహంకాళి ఆలయం ముట్టడి


ఆలయ నిధుల్లో గోల్‌మాల్‌ జరిగిందన్న బిజెపి

హైదరాబాద్‌,డిసెంబర్‌24(జనం సాక్షి):సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలోని నిధుల అవకతవకలపై తెలంగాణ బీజేపీ ఆందోళనకు దిగింది. ఈ మేరకు మహాధర్నాకు పిలుపు నిచ్చింది. దీంతో బీజేపీ నాయకులు మహంకాళి టెంపుల్‌ ముట్టడిరచారు. జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్‌ గౌడ్‌ పిలుపు మేరకు గ్రేటర్‌ హైదరాబాద్‌ మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి తోపాటు బీజేపీ కార్పొరేటర్లు జిల్లా
నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆలయముట్టడికి యత్నించారు. భారీగా మోహరించినన పోలీసులు బీజేపీ నాయకులను,కార్యకర్తలను ఆలయ ఆవరణలో కి వెళ్లకుండా అడ్డుకొని అరెస్టు చేసి వివిధ పోలీస్‌ స్టేషన్స్‌ కు తరలించారు.. ఆలయ నిధులు లెక్కకు రాకపోవడం పై గత ఇఓల పై విమర్శలు వచ్చినా ఎండోమెంట్‌ అధికారులు నిమ్మకునిరెత్తినట్లు ఉన్నారని జిల్లా ప్రెసిడెంట్‌ శ్యాంసుందర్‌ గౌడ్‌ అన్నారు..
భక్తులు ఇచ్చిన కానుకను రిజిస్టర్‌లో ఉన్నట్లుగా అధికారులు లెక్క చూపడం లేదంటూ నిరసన చేస్తుంటే అరెస్టులు చేయడం ఏమిటని మాజీ మేయర్‌ బండ కార్తీక రెడ్డి అన్నారు. దీనిపై నిజాలు తెలియచేసి ఆస్తుల వివరాలను ప్రకటించాలన్నారు.