కాళేశ్వరంతో తెలంగాణకు జలసిరి


అనేక రిజర్వాయర్లతో పెరిగిన జలమట్టం

సంకల్పం నెరవేరడంతో ఆత్మవిశ్వాసంలో కెసిఆర్‌
హైదరాబాద్‌,డిసెంబర్‌31(జనంసాక్షి): కోటి ఎకరాలకు సాగునీరు లక్ష్యంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ప్రధానమైన కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తికి సిఎం కెసిర్‌ ప్రత్యేక శ్రద్ద తీసుకోవడంతో దీని ఆధారంగా నిర్మాణం అయిన అనేక ప్రాజెక్టులు జలసిరితో ఉట్టిపడుతున్నాయి. ఇదే సందర్భంలో తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్‌ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత ముందుకు పోవాలని సీఎం ఆకాంక్షించారు. ప్రజలు సుఖసంతోషాలతో జీవించాలని భగవంతుడిని సీఎం కేసీఆర్‌ కోరారు. మరోవైపు రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసి నీరందించాలని భావిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
ప్రాజెక్ట్‌ పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. స్వయంగా పరిశీలించి పనుల పురోగతిని తెలుసుకుంటున్నారు. అనుకున్న లక్ష్యం నెరవేరుతోంది. కాళేశ్వరంతో కలలు సాకారం అవుతున్నాయి. నీటిని ఒడిసిపట్టడం ద్వారా గోదారమ్మను తెలంగాణ పల్లెలకు పారించాలన్న కలలు నెరవేరుతున్న తరుణంలో సిఎం కెసిఆర్‌ మరింత భరోసాగా ఉన్నారు. గతేడాది కాళేశ్వరం పనులను పరిశీలించి, పనులను పరుగెత్తేలా చేసిన సిఎం ఇప్పుడు ప్రాజెక్టుల పనితీరుపై ధీమాగా ఉన్నారు. ఇంత అద్భుతమైన నీటి సదుపాయం కలుగటం చాలా సంతృప్తి కల్గిస్తున్న విషయం. గోదావరి కిందకుపోతున్న వేళ దానిని ఒడిసిపట్టి పైకి తీసుకుని వచ్చే ప్రయత్నంలో భగరీథ యత్నం సాగుతోంది.ఒక్కో ప్రాజెక్ట్‌ పూర్తవుతుంటే నిజంగానే తెలంగాణ సస్యశ్యామలం కావడంలో ఆశ్చర్యం ఉండదు. ప్రాజెక్టులు సాకారం కావడంతో అంతకు మించిన ఆనందం పాలకుడిగా కెసిఆర్‌కు ఎక్కువగానే ఉంటుంది. కరీంనగర్‌ జిల్లాకు లక్ష్మి, సరస్వతి, పార్వతి బరాజ్‌లు, వీటికి కలిసిన శ్రీపాద ఎల్లంపల్లి రిజర్వాయర్‌.. అన్నీ కలిపి 140 కిలోవిూటర్ల గోదావరి 365 రోజులూ సజీవంగా ఉంటుంది. కరీంనగర్‌ జిల్లాకు ఇది అద్భుత జీవధార. అద్భుతంగా భూగర్భ జలాలు పెరుగుతున్నయని గ్రామాల్లో రైతాంగం చెబుతున్నారు. గోదావరి నది మొత్తం కలిపితే 250 కిలోవిూటర్లు అవుతుంది. పాత కరీంనగర్‌ వరకే ప్రత్యేకంగా 140 కిలోవిూటర్ల సజీవ, శాశ్వత జలధార ఉంటుంది. కరీంనగర్‌ జిల్లాలో కాకతీయకాల్వ మెట్‌పల్లి సవిూపంలోని దమ్మన్నపేట వద్ద మొదలై.. వరంగల్‌ జిల్లా హసన్‌పర్తి చేరుకునే దాక 200 కిలో విూటర్లు పారుతుంది. ఈ 200 కిలోవిూటర్ల పొడవునా రెండుపంటలు పండుతాయి. సుమారు తొమ్మిది నెలలు ఈ కాల్వ పారుతూనే ఉంటది. ఇది ఒక సజీవ జలధార. 160 కిలోవిూటర్ల నిడివి వరదకాల్వ 365 రోజులూ నిండే ఉంటది. ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరదకాల్వ ఎప్పుడూ నింపే ఉంటుంది. ప్రతిష్ఠాత్మక కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు శ్రీరాంసాగర్‌ పునరుజ్జీవ పథకం, పాలమూరు` రంగారెడ్డి, డిరడి, సీతారామ ప్రాజెక్టు నిర్మాణాల పురోగతిపై ప్రభుత్వం ఇప్పటికే దృష్టి సారించింది. రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలుత ఆయన ప్రాజెక్టులపైనే సవిూక్ష నిర్వహించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తమ తొలి ప్రాధాన్యం ప్రాజెక్టులే అనే సంకేతాలిచ్చారు. అంతేగాకుండా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్‌ మానేరు నుంచి కొండపోచమ్మ సాగర్‌ వరకు నిర్మిస్తున్న పనులను సీఎం ఎప్పటికప్పుడ ఆరా తీసారు. మొత్తంగా తాను అనుకున్నట్లుగా ప్రాజెక్టులు పూర్తి చేసి గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యం నెరవేరింది. గోదావరి ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ దశ మారనుంది. ఇప్పటికే వ్యవసాయ భూములకు ధరలు పెరగడంతో పాటు, సాగునీరు రావడంతో రైతులకు లాభాలు పండనున్నాయి. ఇక అవసరమైన పంటలే పండిరచి ముందుకు సాగడం రైతు వంతు కావాలి. ప్రభుత్వం చేస్తున్న భగీరథ యత్నంతో రైతన్న ప్రజలకు కడుపునిండా భోజనం పెట్టగలిగితే అంతకుమించిన ఆనందం ఉండదు. ఆహారధాన్యాల కొరత లేకుండా చేయడంలో కృషి సాగాలి. అందుకు ధాన్యం ఉత్పత్తి మన కళ్లముందు సాక్షాత్కరించింది.