ముంబై,డిసెంబర్20( జనం సాక్షి ): స్టాక్ మార్కెట్‌లు భారీ నష్టాల్లో కొనసాగాయి. ఉదయం ట్రేడిరగ్ ప్రారంభంతోనే మార్కెట్‌లు నష్టాల్లో కూరుకుపోయాయి. ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ విస్తృతి నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులన వెనక్కి తీసుకుంటున్నారు. దాంతో మార్కెట్‌లు నష్టాల బాటపట్టాయి. మధ్యాహ్నం 12 గంటల సమయంలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 1408 పాయింట్లు నష్టపోయి 55,602 వద్ద ట్రేడవుతున్నది. ఇక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిప్టీ సైతం నష్టాల్లోనే కొనసాగుతున్నది. మధ్యాహ్నానికి 435 పాయింట్లు కోల్పోయి 16,549 వద్ద ట్రేడవుతున్నది. బజాజ్ ట్విన్స్, ఇండస్ ఇండ్, యాక్సిస్ బ్యాంకు టాప్ లూసర్స్‌గా ఉన్నాయి. ఒమిక్రాన్ భయాల నేపథ్యంలో గత వారం కూడా దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలు మూటగట్టుకున్నాయి.
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు