వికారాబాద్,డిసెంబర్15 (జనంసాక్షి):- పూడూరు మండలంలో ఓ ప్రేమజంట ఆత్మహత్యాయత్నం చేసుకుంది. కండ్లపల్లి నీలగిరి తోటలో ప్రేమజంట పురుగుల మందు తాగడంతో అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు. వీరిని గమనించిన స్థానికులు తక్షణమే పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన నీలగిరి తోటకు చేరిన పోలీసులు ప్రేమజంటను వికారాబాద్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ప్రేమజంటను హైదరాబాద్ బోరబండ వాసులుగా పోలీసులు గుర్తించారు.
ప్రేమజంట ఆత్మహత్యాయత్నం