పశ్చిమగోదావరిలో ఘోర ప్రమాదం
అదుపుతప్పి జల్లేరు వాగులో పడ్డ బస్సుడ్రైవర్ సహా పదిమంది మృతిచెందారని అంచనా
కిటికీల నుంచి దూకి ప్రాణాలు కాపాడుకున్న పలువురు
ముమ్మరంగా కొనసాగుతున్న సహాయక చర్యలు
ప్రమాద ఘటనపై సిఎం జగన్ దిగ్భార్రతి
మరణించిన కుటుంబాలకు 5 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటన
విచారణకు ఆదేశించిన మంత్రి పేర్ని నాని
దిగ్భార్రతి వ్యక్తం చేసిన చంద్రబాబు, శైలజానాథ్
ఏలూరు,డిసెంబర్15 (జనంసాక్షి):- పశ్చిమగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం జంగారెడ్డిగూడెం సవిూపంలో ఓ ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరు వాగులో పడిరది. దీంతో పలువురు ప్రయాణికులు గల్లంతయ్యారు. కొందరు దూకి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆర్టీసీ బస్సు అదుపుతప్పి జల్లేరువాగులో బోల్తాపడటంతో డ్రైవర్‌తోసహా పదిమంది మృతి చెందారు. బుధవారం అశ్వారావుపేట నుండి జంగారెడ్డిగూడెంకు వెళుతున్న తెలుగు వెలుగు బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢకొట్టి జల్లేరు వాగులో బోల్తాపడిరది. ఆ సమయంలో బస్సులో 47 మంది ప్రయాణీకులున్నారు. గమనించిన స్థానికులు, జాలర్లు బస్సులో ఉన్నవారిని కాపాడేందుకు ప్రయత్నించారు. అప్పటికే ఊపిరాడక ఏడుగురు మరణించారు. బస్సులో 47మందికిపైగా ఉండటం, ఓవర్ లోడ్‌తో వెళుతుందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. సమాచారం అందుకుని
సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్లో అధికారులు, పోలీసులు నిమగ్నమయ్యారు. ప్రస్తుతం పోలీసులు, రెవెన్యూ అధికారులు 22 మంది క్షతగాత్రులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పడిపోయిన బస్సును క్రేన్ సాయంతో పైకి తీసిన తర్వాత ఘటన పై ఒక అంచనా వచ్చే అవకాశం ఉంది.
ప్రమాదం జరిగిన వెంటనే బస్సు కిటికీల నుంచి దూకి పలువురు ప్రయాణికులు ప్రాణాలు కాపాడు కున్నారు. బస్సు వాగులో పడిన వెంటనే స్థానికులు, వాహనదారులు స్పందించారు. పోలీసులు, అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. జల్లేరు వాగులోకి బస్సు పడిపోయిన ఘటనపై సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భార్రతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపాన్ని తెలియజేశారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని అధికారులను ఆదేశించారు. గాయపడ్డ వారికి మెరుగైన చికిత్స అందేలా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. ఇదిలావుంటే పశ్చిమగోదావరి జిల్లా బస్సు ప్రమాదంపై మంత్రి పేర్నినాని దిగ్భార్రతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. బస్సు ప్రమాదంపై విచారణకు ఆదేశించారు. విచారణ జరిపి నివేదిక అందించాలని ఉన్నధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందిం చాలని సీఎం
జగన్ ఆదేశించారని తెలిపారు. వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని సీఎం స్పష్టం చేశారని మంత్రి పేర్నినాని వెల్లడిరచారు. ప్రమాదంపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దిగ్భార్రతి వ్యక్తం చేశారు. జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై డ్రైవర్‌తో సహా పలువురు మృతి చెందటం అత్యంత బాధాకరమన్నారు. సంఘటన సవిూపంలో ఉన్న పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించటంతో పాటు బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఘటనలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాడ సానూభూతిని తెలియజేశారు.ప్రమాదంపై ఏపీసీసీ అధ్యక్షులు సాకె శైలజానాథ్ స్పందించారు. బస్సు ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవటం బాధాకరమన్నారు. జల్లేరు వాగులోకి ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురై డ్రైవర్‌తో సహా పలువురు మృతి చెందటం బాధ కలిగించిందని అన్నారు. అక్కడి కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో చనిపోయినవారి కుటుంబ సభ్యులకు శైలజనాథ్ ప్రగాడ సానూభూతిని తెలియజేశారు.