విమాన ప్రయాణాలతోనే అసలు ముప్పు


ప్రయాణికులతో వేగంగా విస్తురిస్తున్న ఒమిక్రాన్‌

హెచ్చరించిన ప్రపంచ విమానయాన సంస్థ
న్యూడిల్లీ,డిసెంబర్‌23 (జనం సాక్షి) : విమానప్రయాణాలతో ఒమిక్రాన్‌ వ్యాప్తి పెరుగుతోందని గుర్తించారు. వివిధ దేశాలకు ప్రయాణాల వల్ల ఇది వేగంగా విస్తరిస్తోంది. ఇటీవల కేసుల సంఖ్యను పరిశీలించినప్పుడు ..వైరస బారినపడ్డ వారంతా విమాన ప్రయాణికులేనని తేలింది. ఈ క్రమంలో ప్రపంచంలోని విమాన ప్రయాణికులకు ఒమైక్రాన్‌ వేరియంట్‌ రెట్టింపు ముప్పు ఉందని ప్రపంచ విమానయాన సంస్థ హెచ్చరించింది. ఒమైక్రాన్‌ వేరియంట్‌ ఆవిర్భవించినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా విమాన
ప్రయాణికులకు రెండు లేదా మూడు రెట్లు ఎక్కువగా వ్యాప్తిచెందే ప్రమాదం ఉందని ప్రపంచ విమానయాన సంస్థల ఉన్నత సలహాదారు చెప్పారు. కొన్ని వారాల్లోనే కరోనా కొత్త వేరియెంట్‌ ఎక్కువగా వ్యాపిస్తుందని వైద్యసలహాదారు తేల్చి చెప్పారు. ఎక్కువ మంది ప్రయాణికులున్న ఎకానవిూ విమాన క్యాబిన్‌ కంటే బిజినెస్‌ క్లాస్‌లో సురక్షితంగా ప్రయాణించవచ్చని ఇంటర్నేషనల్‌ ఎయిర్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అసోసియేషన్‌ వైద్య సలహాదారు డేవిడ్‌ పావెల్‌ చెప్పారు. గతంలోలాగా విమాన ప్రయాణికులు విమానంలో ఉపరితలాలను తాకకుండా నివారించాలని డేవిడ్‌ సూచించారు.విమాన ప్రయాణికులు సాధ్యమైన చోట చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, మాస్కులు ధరించడంతోపాటు సామాజిక దూరం పాటించాలని వైద్యులు సూచించారు.విమానాల్లో ఇతర ప్రయాణికులతో ముఖాముఖి మాట్లాడటాన్ని నివారించాలని కోరారు.విమానాల్లో ఒమైక్రాన్‌ ఇన్‌ఫెక్షన్‌ సోకే ప్రమాదం ఎక్కువగా ఉన్నందున ప్రయాణికులు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచించారు.