ఇంటర్‌ ఫలితాలపై ఆందోళన వద్దు


ధైర్యంగా ఉండాలంటున్న నిపుణులు

హైదరాబాద్‌,డిసెంబర్‌20(జనం సాక్షి): ఇంటర్‌ మొదటి సంవత్సరం పరీక్ష ఫలితాలు విడుదలైన తర్వాత కొంతమంది విద్యార్థులు మానసిక ధైర్యాన్ని కోల్పోతున్న తీరు ఆందోళన కలిగిస్తోంది. అసలు పరీక్షలు పెట్టమని చెప్‌ఇన ప్రభుత్వం చివరకు పరీక్షలు నిర్వహించడం, ఫలితాలు కవలం 49శాతం మంది మాత్రమే పాసయినట్లు రావడం గందరగోళానికి దారితీసింది. అయితే అలా భయపడాల్సిన అవసరం ఏవిూలేదని విద్యారంగ నిపుణులు అంటున్నారు. 18 నెలలు కొవిడ్‌ వల్ల విద్యార్థులు ప్రత్యక్ష తరగతులకు హాజరుకాలేక, ఆన్‌లైన్‌ తరగతులు వినలేక చాలా నష్టపోయారు. ఈ పరిస్థితులను గమనించి ఇంటర్‌బోర్డు కేవలం 70శాతం సిలబస్‌ ప్రశ్నలు, 50శాతం చాయిస్‌ ఇచ్చింది. అయినా చాలామంది విద్యార్థుల పరీక్షల్లో తప్పారు. విద్యార్థులు పూర్తిస్థాయిలో సమాధానాలు రాయలేక పరీక్షల్లో తక్కువ మార్కులు సాధించారు. ఫెయిల్‌ అయిన విద్యార్థులకు వచ్చే ఏప్రిల్‌లో మరోసారి పరీక్షలు నిర్వహిస్తామని, ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. 50శాతం తక్కుఫీజుతోనే విద్యార్థులు జవాబు పత్రాలను రీవాల్యూయేషన్‌, రీకౌంటింగ్‌ చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు గతంలో స్లిప్‌టెస్టులు, నెలవారి టెస్టులు, క్వార్టర్లీ, హాఫ్‌ ఇయర్‌ పరీక్షలు, ప్గ్రీªనైల్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాత సంవత్సరం పరీక్షలు జరిగేవని, అలాకాకుండా ప్రస్తుతం నేరుగా పరీక్షలు నిర్వహించడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని అన్నారు. జవాబపత్రాల వాల్యూయేషన్‌లో ఎలాంటి పొరపాట్లు జరగవని, పకడ్బందిగా స్జబెక్టు నిపుణుల పర్యవేక్షణలో ఉంటుందని తెలిపారు. ఇంటర్‌ మొదటి సంవత్సరం ఫెయిలైనంత మాత్రాన విద్యార్థులు తమ జీవితాలను ముగించుకోవాల్సిన అవసరంలేదని, భవిష్యత్తులో మంచి మార్కులు సాధించే అవకాశం ఉందన్నారు. విద్యార్థులను తల్లిదండ్రులు అనవసరంగా బెదిరింపులకు గురిచేయవద్దని, విద్యార్థులు కుంగిపోతుంటే మానసిక వైద్యుడికి చూపించాలన్నారు.