మేడారంలో చురుకుగా జాతర పనులు

కరోనా జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాట్లు

ములుగు,డిసెంబర్‌3(జనం సాక్షి): ఒకవైపు కరోనా కలవర పెడుతుంది. మరోవైపు కోట్లాది మంది కోరికలు తీర్చే మేడారం మహా జాతరకు సమయం ఆసన్నమవుతుంది. ఈ నేపద్యంలో ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది. సమక్క` సారలమ్మ జాతర గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే పండగ. మేడారం సమ్మక్క`సారక్క జాతరకు సమయం ఆసన్నమావడంతో ప్రభుత్వం పనుల్లో వేగం పెంచింది.. ఇప్పటికే  మేడారంను సందర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్‌ 2022 మహాజాతర ఏర్పాట్లపై అధికారులతో సవిూక్షిం చారు.  వనదేవలకు మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చే భక్తులకు వసతుల్లో ఎలాంటి లోటు లేకుండా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.. శాశ్వత ఏర్పాట్లు ప్రణాళికా బద్ధంగా చేపట్టాలని అధికా రులకు ఆదేశించారు. 2022 ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు మేడారం మహా జాతర నిర్వహించ నున్నట్లు పూజారులు తెలిపారు. ఈ నేపథ్యంలో భక్తులకు వసతుల కల్పన కోసం ప్రభుత్వం 75 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. ఇప్పటికే 32 ప్రభుత్వశాఖలకు ఆ పనుల బాధ్యతలు అప్పగించారు. జంపన్నవాగు వద్ద భక్తులకు ఏర్పాట్లు, స్నానఘట్టాలు, దుస్తుల మార్పిడి గదులు, ప్రమాదాలు సంభవించకుండా తీసుకుంటున్న చర్యలు, భక్తుల వసతి సౌకర్యాలపై మేడారం ప్రాంతమంతా తిరిగిన మంత్రి సత్యవతి స్వయంగా  పర్యవేక్షించారు. అనంతరం అక్కడ జరుగుతున్న పనులపై సంబంధిత అధికారులతో సవిూక్షించారు. గత ప్రభుత్వాలతో పోలిస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చాక శాశ్వత ప్రాతిపాదికన బడ్జెట్‌ కేటాయించడం జరిగింది. ప్రతి ఒక్కరు మాస్క్‌ ధరించి జాతరకు రావలసిందిగా ఇప్పటినుండే అవగాహన కల్పించనున్నారు. గత జాతరలలో జరిగిన చిన్ని` చిన్న పొరపాట్లను గమనించి, గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి అవి పునరావృతం కాకుండా చూస్తున్నారు. జాతరకు వచ్చే ప్రజల సౌకర్యార్ధం తగిన విధంగా ఆర్టీసి నుంచి రవాణ సౌకర్యాలు కల్పించబోతున్నది. జనవరి మొదటి వారంలోగా పనులు పూర్తి చేసేందుకు అధికారులు శ్రమిస్తున్నారు.