నల్లగొండ జిల్లాలో దారుణ ఘటన


ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తండ్రి ఆత్మహత్య

నల్గొండ,డిసెంబర్‌24(జనం సాక్షి): జిల్లాలోని దామరచర్ల మండలం నూనావత్‌ తండాలో దారుణం జరిగింది. ఓ తండ్రి తన ఇద్దరు చిన్నారులకు విషమిచ్చి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో
ముగ్గురు మృతి చెందారు. కుటుంబ కలహాలే ఈ అఘాయిత్యానికి కారణంగా తెలుస్తోంది. వ్యవసాయ పొలం వద్ద తండ్రి గేరు కిషన్‌(32) తన ఇద్దరు కుమారులు హర్షవర్ధన్‌ (8), అఖిల్‌(7)లకు విషమిచ్చి చంపి... ఆపై తాను కూడా ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏ కష్టమొచ్చిందో.. ఏమో తెలియదు కానీ.. ఓ తండ్రి ఇద్దరు పిల్లలకు విషమిచ్చి చంపి.. తాను ఆత్మహత్య చేసుకున్నాడు. తన ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి చంపి.. తండ్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. నునావత్‌ తండాకు చెందిన కిషన్‌ నాయక్‌ వ్యవసాయం పొలం వద్ద.. కిషన్‌, అతని కుమారులు హర్షవర్ధన్‌ (8) అఖిల్‌ (6) మృతదేహాలను గ్రామస్థులు గుర్తించారు. పురుగుల మందును మజా కూల్‌ డ్రిరక్‌లో కలిపి తాపించి కుమారులను చంపి.. ఆపై కిషన్‌ చెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాలు కారణంగా ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థుల నుంచి పలు వివరాలు సేకరించారు. కుటుంబ కలహాలతోనే ఈఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.