మరణించిన పోలీసు కుటుంబాలకు ఉద్యోగాలు

  


నియామక పత్రాలు అందచేసిన సిపి

 హైదరాబాద్‌,డిసెంబర్‌1 ( జనం సాక్షి):  సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనరేట్‌ లో పనిచేస్తూ..విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసుల  కుటుంబ సభ్యులకు సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనర్‌స్టీఫెన్‌ రవీంద్ర, ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు.  సైబరాబాద్‌ పోలీస్‌ కవిూషనరేట్‌లో  పనిచేస్తూ రోడ్డు ప్రమాదాలలో మరణించిన రిజర్వ అసిస్టెంట్‌ సబ్‌ ఇన్స్పెక్టర్‌ నారం రెడ్డి  కొడుకు భార్గవ రెడ్డికి, ఆర్మేడ్‌ కానిస్టేబుల్‌ ఆంజనేయులు భార్య శివ లీలకు, కానిస్టేబుల్‌  గుండెరావు తమ్ముడు శివకుమార్‌, సబ్‌ ఇన్స్పెక్టర్‌ ఆంజనేయులు కొడుకు శ్రీకాంత్‌ లకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా సీపీ  మాట్లాడుతూ బాగా  పనిచేసి, పోలీస్‌ డిపార్ట్‌మెంట్‌ కు మంచి పేరురు తీసుకురావాలన్నారు.