ఆధ్యాత్మిక క్షేత్రం వారణాసి


కాశీ అభివృద్దితో మారనున్న గతి

వారణాసి,డిసెబర్‌17 (జనంసాక్షి):   చనిపోయేలోగా కాశీకి వెళ్లాలన్న కోరికి ప్రతి ఒక్కరిలో ఉంటుంది. హిందువులకు ఈ క్షేత్రం అత్యంత పవిత్రమైనది. అందుకే వెనకటికి కాశీకి పోవడమంటే కాటికి పోయినట్లే అని అనేవారు. అప్పట్లో కాలినడకన కాశీకి పోయి అక్కడే స్వామిని దర్శించుకుని తనువు చాలించే వారు. ముష్కరదాడిలో కాశీ ధ్వంసం అయినా ఆనాటి మహరాణి అహల్యాబాయి దానిని పునర్‌ నిర్మించి మనకు భిక్ష పెట్టారు. ఆ తరవాత వందల ఏళ్లకు ఇప్పుడు కాశీ విశ్వనాథ్‌ కారిడార్‌ ప్రాజెక్టు మొదటి దశను ప్రధాని మోడీ పూర్తి చేయించారు. గంగానదిని కూడా కాలుష్యం నుంచి దూరం చేస్తే అంతకు మించిన ఆనందం మరోటి ఉండదు. కాశీ కారిడార్‌ ఆరంభాన్ని కొత్త చరిత్రకు, భవ్యమైన భవిష్యత్తుకు నిదర్శనంగా చూడాలి. కాశీ విశ్వనాథుడి ఆలయ పునరుద్దరణ ఓ అద్బుత ఆవిష్కరణగా చూడాలి. రాణి అహల్యాబాయి పుణ్యంతో ఆనాడు పునరుద్దరించిన కాశీని ఇప్పుడు మోడీ మళ్లీ 399 కోట్లు వెచ్చించి మరింత ఉన్నతంగా తీర్చి దిద్దారు. మన ఆధ్యాత్మిక సౌరభాన్ని వెల్లివిరిసేలా చేశారు. గంగానదిలో స్నానాలు, తర్పణాల నుంచి ఆలయంలో పూజల వరకూ ప్రతీది పునర్మించిన తీరు అమోఘం. కాశీ ఆలయ పునర్నిర్మాణం సందర్బంగా ఎన్నో ఆలయాల పునరుద్దరణ సాగింది. ఎన్నో ఆలయాలు బయటపడ్డాయి. ఇలాంటి వాటిని ఆక్రమించి ఇళ్లు కట్టుకున్న తీరు బయటపడిరది. ప్రధాని తన నియోజకవర్గాన్ని తీర్చిదిద్దడంలో బాగంగా కాశీ ఆలయం పునరుద్దరణతో పాటు..పట్టణాన్ని కూడా సుందరంగా తీర్చి దిద్దాల్సి ఉంది. గంగా ప్రక్షాళన ఇందులో ప్రధానమైనది. ఇవన్నీ పూర్తి అయితేనే కాశీ సుందర ఆధ్యాత్మిక నగరంగా మళ్లీ సాక్షాత్కరించనుంది. కాశీ అంటేనే హిందువులకు పరమపవిత్రం. కాబట్టి ఈ క్షేత్రాన్ని ఎంతఖర్చుపెట్టయినా తీర్చిదిద్దాల్సిందే. అందుకు ఎలాంటి విమర్శలను లెక్కచేయరాదు.