సిఎం జగన్‌ పుట్టినరోజు వేడుకలు

మొక్కలు నాటిన మంత్రి అనిల్‌ కుమార్‌

నెల్లూరు,డిసెంబర్‌21 ( జనం సాక్షి):  ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా మంత్రి అనీల్‌ కుమార్‌ యాదవ్‌ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మంత్రి విూడియాతో మాట్లాడుతూ తండ్రిని మించిన సంక్షేమాన్ని సీఎం అందిస్తున్నారని, రాష్ట్రంలో ప్రజారంజక పాలన సాగుతోందని కొనియాడారు. సీఎం జగన్‌ వెంట సైనికుడిలా పనిచేస్తానన్నారు. సిద్దాంతాలు వదిలి అన్ని పార్టీలు ఏకమై, ప్రభుత్వంపై దుష్పచ్రారాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ప్రజలు జగన్‌ వెంటే ఉన్నారన్నారు. ఈ రోజు మరో మంచి పథకానికి సీఎం శ్రీకారం చుట్టబోతున్నారని, పేదల ఇళ్లకి ఉచితంగా రిజిస్టేషన్‌లు చేసి ఇవ్వబోతున్నామన్నారు. ఈ పథకాన్ని కూడా అడ్డుకునేందుకు చంద్రబాబు అండ్‌ కో ప్రయత్నిస్తున్నారని మంత్రి అనీల్‌ అన్నారు.