బిజెపివి ప్రజావ్యతిరేక నిర్ణయలు

  విజయవాడ,డిసెంబర్‌20( జనం సాక్షి): బీజేపీ ప్రభుత్వాన్ని గద్దే దింపేవరకు కాంగ్రెస్‌ పోరాటం చేస్తుందని పార్టీ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ తులసిరెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు తగ్గించే వరకు పోరాటం సాగిస్తామన్నారు. ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ప్రైవేటీకరణ చేయడం దారుణమని అన్నారు. బీజేపీ ప్రభుత్వం సామాన్య ప్రజలను బతకనివ్వడం లేదని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వస్త్రాలపై విధించిన అదనపు జీఎస్‌టీ 5 శాతం నుంచి 12 శాతానికి పెంపును ఆయన ఖండిరచారు. పన్నుల పెంపుపై ఆందోళన వ్యక్తంచేశారు. పెంచిన జీఎస్‌టీ పన్నుల వల్ల అటు ప్రజలు, ఇటు వ్యాపారులపై పెనుభారం పడుతుందని, తక్షణం ఈ నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండు చేశారు.