ఉపాధ్యాయ హావిూలు నెరవేర్చాలి

కడప,డిసెబర్‌11(జనంసాక్షి)  ఎన్నికల సమయంలో తెదేపా ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలన్నింటినీ అమలు చేయాలని  ఉపాధ్యాయ సంఘాల నేతలు  డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులకు ఇచ్చిన హావిూలు రాష్ట్ర ప్రభుత్వానికి గుర్తుకు వస్తున్నాయన్నారు. గతంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టినవి ఇప్పటికీ అమలుకు నోచుకోని హావిూలు ఉన్నాయనీ చిత్తశుద్ధితో వాటిని నెరవేర్చాలన్నారు. ఒప్పంద అధ్యాపకుల రెగ్యులరైజేషన్‌ హావిూ ఏమైందని ప్రశ్నించారు. ప్రత్యేక ఉపాధ్యాయుల నోషనల్‌ ఇంక్రిమెంట్స్‌ గురించి పట్టించుకోవాలన్నారు.మండల విద్యాధికారులు, డిప్యూటీ విద్యాధికారులు, డైట్‌ అధ్యాపకులు, 40 శాతం జూనియర్‌ అధ్యాపకుల ఖాళీలు ఉన్నాయనీ జీవో ఇచ్చిన పండిట్‌, పీఈటీ పోస్టుల అప్‌గ్రేడేషన్‌ ఇప్పటికీ అమలు కాలేదన్నారు. నెలసరి ప్రీమియం చెల్లించినా ఆరోగ్యకార్డులు అమలు కాలేదన్నారు. ఆదర్శ పాఠశాలలకు పదో పీఆర్సీ ఇవ్వలేదన్నారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ రద్దు చేయాలన్నారు.