స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం మాదే

  


బలిమి లేకున్నా బరిలోకి దిగారు

బిజెపిపైండిపడ్డ మంత్రి గంగుల కమలాకర్‌

గులాబీ కండువతో వచ్చి హల్‌చల్‌

కరీంనగర్‌,డిసెంబర్‌10 జనంసాక్షి: కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా పరిధిలోని రెండు ఎమ్మెల్సీ స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులే గెలిచి తీరుతారని రాష్ట్ర బీసీ సంక్షేమం, పౌర షరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని జడ్పీ కార్యాలయంలో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన విూడియాతో మాట్లాడారు. స్థానిక సంస్థల్లో తమకు వెయ్యి ఓట్ల వరకు ఉన్నాయని, ఇందులో ఒక్క ఓటు కూడా తగ్గకుండా తమ అభ్యర్థులు ఇద్దరికి వస్తాయని మంత్రి గంగుల ధీమా వ్యక్తం చేశారు. పార్టీ పట్ల ప్రతి ఒక్కరు అంకితభావంతో ఉన్నారని, ఏ ఒక్క ఓటు కూడా క్రాసయ్యే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. బలం లేకున్నా కొన్ని దుష్టశక్తులు కావాలనే నామినేషన్‌ వేశాయని మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కొందరికి కళ్ళు మండుతున్నాయని వ్యాఖ్యానించారు. మాకు వెయ్యి ఓట్లున్నాయి..మా పవర్‌ చూపిస్తాం అని స్పష్టం చేశారు. ఎన్నిక ఏక పక్షమని.. ఒక్క ఓటు కూడా తగ్గదని అన్నారు. రవీందర్‌ సింగ్‌కు ఈటెల రాజేందర్‌ సపోర్ట్‌ చేశారన్నారు. అయితే రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌నా లేక... ఈటెల రాజేందరా అని ప్రశ్నించారు. తల తెగినా.. టీఆర్‌ఎస్‌ జెండా వదలమని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు.  ఇదిలావుంటే గులాబీ కండువాతో వచ్చిన మంత్రి గంగుల కమలాకర్‌ను అభ్యంతరం తెలిపారు. అయితే కరీంనగర్‌ లో మంత్రి గంగుల కమలాకర్‌ హల్‌ చల్‌ చేశారు. జిల్లా పరిషత్‌ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూతు వద్ద తన అనచరులతో కలిసి హడావుడి చేశారు. దీంతో మంత్రిని లోపలకు అనుమతించేందుకు ఆయనను మాజీ మేయర్‌ రవీందర్‌ సింగ్‌ నిరాకరించారు. కండువాలతో రావద్దని ఆయన అనడంతో.. ఇవి పార్టీ కండువాలు కావని.. దేవుడికి సంబంధించిన కండువాలు అని మంత్రి వాగ్వాదానికి దిగారు. పోలింగ్‌ బూత్‌ లోకి వస్తూ అసభ్య పదాలు  ఉపయోగించారు మంత్రి గంగుల కమలాకర్‌. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ 1324లో వెయ్యి మంది  తమ వాళ్ళే.. అన్నారు. 986 కి ఒక్కటి తగ్గినా మా క్రమశిక్షణ తగ్గినట్టే అన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ మాకు బలం లేదని తప్పుకున్నామని చెప్పారు. ఏకగ్రీవం ఎందుకు కావాలని..కడుపు కళ్ళ మంటతో..తమలో చిచ్చు పెట్టాలని కొందరు నామినేషన్‌ వేశారని మంత్రి ఆరోపించారు. ఎవరి మద్దతో తెలియదు బరిలో నిలిచాడంటూ విమర్శలు చేశారు. ఎన్నిక దాదాపు ఏకపక్షమన్నారు.  కరీంనగర్‌ మున్సిపాలిటీ లో 14 మంది కార్పొరేటర్లు ఉన్నారు. 14 మంది ఓట్లు విూకు పడతాయా చూసుకోండి. బీజేపీ ఓట్లు మొత్తం విూకు పడతాయా అంటూ రవీందర్‌ సింగ్‌ కు సవాల్‌ విసిరారు మంత్రి గంగుల. పడకపోతే ఎవరు బాధ్యత వహిస్తారు..బండినా ..ఈటలనా? అంటూ ప్రశ్నించారు. తల తెగినా మేము టీ ఆర్‌ ఎస్‌ వైపే అంటూ మంత్రి సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. ఈ ఎన్నిక తర్వాత రాజకీయ పరిణామాలు మారుతాయి. రాష్ట్రం సాధించిన హక్కు దార్లం మేమే అన్నారు. శిఖండి రాజకీయాలు చేసేవారు కేసీఆర్‌ ముందు మాడిమసి అయి పోతారన్నారు.