భరతమాత ముద్దుబిడ్డ రావత్‌కు కన్నీటి వీడ్కోలు







సైనిక లాంఛనాలతో త్రివిధ దళాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు

చితికి నిప్పంటించిన కుమార్తెలు కృతిక,తరుణి

నివాళి అర్పించిన విదేశీ రాయబారులు, ఆర్మీ చీఫ్‌లు

ఢల్లీిలో అంతిమయాత్రలో పాల్గొన్న అశేష జనవాహిని

న్యూఢల్లీి,డిసెంబర్‌10(జనం సాక్షి): దేశభక్తిని అణువణువునా కలిగి..నిరంతరం దేశ రక్షణకు శ్రమించిన భారత త్రివిధ దళాల చీఫ్‌ బిపిన్‌ రావత్‌ అంత్యక్రియలు అశ్రునయనాల మధ్య ముగిసాయి.  కర్తవ నిర్వహణలోనే ఆయన చివరకు కన్నుమూసిన సీడీఎస్‌ చీఫ్‌ బిపిన్‌ రావత్‌కు ఆశ్రు నాయనాల మధ్య అంతిమ వీడ్కోలు పలికారు. భారత ఆర్మీని ప్రొఫెషన్‌ ఆర్మీగా తీర్చిదిద్దేందుకు ప్రయత్నించిన రావత్‌కు విషన్నవదనాలతో గుడ్‌బై పలికారు. రణనీతిలో తన అనన్యసామాన్య కౌశలాన్ని ప్రదర్శించిన బిపిన్‌ ఎప్పటికీ గుర్తుండిపోతారు. కేవలం సైన్యాధికారి రూపంలో మాత్రమే కాదు.. వ్యక్తి రూపంలో ఆయన అందర్నీ ఆకట్టుకున్నారు. దేశభక్తి, పరాక్రమం, వీరత్వం, సాహస గుణాలతో అందర్నీ మెప్పించారు. అజేయ యోధుడిగా అమరుడయ్యారు. దేశానికి ప్రేరకుడిగా నిలిచిన జనరల్‌ రావత్‌కు ఇవాళ ఢల్లీిలోని బారర్‌ స్క్వేర్‌లో ఘనంగా సైనిక రీతిలో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. సైనిక లాంఛనాలతో అంతిమ సంస్కారాలు చేపట్టారు. కుమార్తెలు కృతిక తరుణిలు తల్లిదండ్రలు చితికి నిప్పంటించారు. ఈ నేపథ్యంలో 17 గన్‌ సెల్యూట్‌ చేశారు. అంతకముందు ఆయన ఆత్మకుశాంతి చేకూర్చాలని విదేశీ అంబాసిడర్లు, ఆర్మీ నాయకులు ప్రార్థించారు. పుష్ప గుచ్ఛాలు అర్పించారు. శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ ఆర్మీ చీఫ్‌లు హాజరయ్యారు. 800 మంది త్రివిధ దళాల సైనికులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు.ఢల్లీి బ్రార్‌ స్క్వేర్‌ శ్మశానవాటికలో సైనిక లాంఛనాలతో జనరల్‌ బిపిన్‌ రావత్‌ దంపతుల అంతిమ సంస్కారాలు జరిగాయి. త్రివిధ దళాల్లోని అన్ని ర్యాంకులకు చెందిన 99మంది సైనికాధికారులు.. 33 మందితో కూడిన ట్రై సర్వీస్‌ బ్యాండ్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. త్రివిధ దళాలకు చెందిన మొత్తం 800మంది సేవా సిబ్బంది అంత్యక్రియాల్లో పాలుపంచుకునున్నారు. జనరల్‌ రావత్‌ కుమార్తెలు కృత్తిక, తరిణి కూడా కడసారి నమస్కరించి, నివాళులర్పించి తండ్రి చితకి నిప్పట్టించారు. శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌కు చెందిన సీనియర్‌ మిలటరీ కమాండర్లు జనరల్‌ రావత్‌ అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఢల్లీి వచ్చారు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) జనరల్‌ బిపిన్‌ రావత్‌కు నివాళులర్పించినవారిలో శ్రీలంక, భూటాన్‌, నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల టాప్‌ మిలిటరీ కమాండర్లు ఉన్నారు. శ్రీలంక సైన్యం చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అండ్‌ కమాండర్‌ జనరల్‌ షవేంద్ర సిల్వ, రాయల్‌ భూటాన్‌ ఆర్మీ డిప్యూటీ చీఫ్‌ ఆపరేషన్స్‌ ఆఫీసర్‌ బ్రిగేడియర్‌ డోర్జీ రించెన్‌, నేపాల్‌ సైన్యం చీఫ్‌ ఆఫ్‌ జనరల్‌ స్టాఫ్‌ లెప్టినెంట్‌ జనరల్‌ బాలకృష్ణ కర్కి, బంగ్లాదేశ్‌ ఆర్మ్‌డ్‌ ఫోర్సెస్‌ డివిజన్‌ ప్రిన్సిపల్‌ స్టాఫ్‌ ఆఫీసర్‌ లెప్టినెంట్‌ జనరల్‌ వకార్‌ ఉజ్‌ జమన్‌ నివాళులర్పించారు. జనరల్‌ రావత్‌తో కలిసి నేషనల్‌ డిఫెన్స్‌ కాలేజీలో చదివిన శ్రీలంక మాజీ చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ అడ్మిరల్‌ రవీంద్ర చంద్రిసిరి విజేగుణరత్నే (రిటైర్డ్‌) కూడా తన స్నేహితునికి నివాళులర్పించారు. అంతకుముందు రావత్‌ దంపతుల అంతిమయాత్ర ప్రారంభమైంది. ఢల్లీి కామ్రాజ్‌ మార్గ్‌ లోని రావత్‌ నివాసం నుంచి వారి భౌతికకాయాలనుంచిన వాహనం ఢల్లీి కంటోన్మెంట్‌లోని బ్రార్‌ స్క్వేర్‌లోని శ్మశానవాటికకు బయలుదేరింది. ప్రజలు, నేతలు, సైనికులు పెద్ద సంఖ్యలో అంతిమయాత్రలో పాల్గొన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రులు, పలు రాష్టాల్ర ముఖ్యమంత్రులు, పలువురు నేతలు రావత్‌ దంపతుల భౌతికకాయాలకు నివాళులర్పించారు. దారిపొడవునా ఢల్లీి ప్రజలు నివాళి అర్పించారు. భారత్‌ మాతాకు జై..బిపిన్రావత్‌ అమర్‌ రహే అన్న నినాదాలు మిన్నంటాయి.  దేశ వీరుడికి జనం వందనాలు పలికారు. భరత భూమి పుత్రుడు రావత్‌ అమర్‌ రహే అంటూ నినాదాలు హోరెత్తాయి. ఢల్లీిలో కామ్‌రాజ్‌మార్గ్‌లోని తన నివాసం నుంచి బ్రార్‌ స్క్వేర్‌లోని శ్మశానవాటిక వరకు జనరల్‌ బిపిన్‌ రావత్‌ అంతిమయాత్ర కొనసాగింది. వీర నాయకుడికి అంతిమ వీడ్కోలు పలికేందుకు జనం భారీగా హాజరయ్యారు. పార్దీవదేహాంతో వెళ్తున్న వాహనంపై జనం పూవ్వులు కురిపించారు. కొందరు యువత జాతీయ జెండాలను చేతుల్లో పట్టుకుని ఆ వాహనం వెంట పరుగులు తీశారు. సేన ఆధునీకరణ కోసం అంతిమ క్షణాల వరకు జీవితాన్ని అర్పించిన బిపిన్‌ రావత్‌కు ఘన వీడ్కోలు లభించాయి. రోడ్డుకు ఇరువైపుల నిలబడ్డ జనం.. పువ్వులు కురిపిస్తూ.. త్రివర్ణ జెండాలను ఊపుతూ తమ దేశభక్తిని చాటారు. వీర సైనికుడు బిపిన్‌ రావత్‌ అంతిమయాత్రలో.. ఇండియన్‌ ఆర్మీ జిందాబాద్‌.. వందేమాతరం అంటూ నినాదాలు కూడా మార్మోగాయి. వ్యూహాలు, ప్రణాళికలతో శత్రువుల గుండెల్లో దడపుట్టించిన బిపిన్‌ రావత్‌.. ఈ లోకాన్ని అనూహ్యంగా విడిచి వెళ్లారు. బుధవారం తమిళనాడులో హెలికాప్టర్‌ కూలిన ఘటనలో ఆయన దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.