తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం


తిరుపతి బదులు బెంగుళూరులో ల్యాండిరగ్‌

ఇబ్బందులకు గురి చేసిన ఇండిగోపై కేసు వేస్తామన్న రోజా
తిరుపతి,డిసెంబర్‌14 (జనంసాక్షి ):  ఇండిగో విమాణం ప్రయాణీకులకు చుక్కలు చూపించింది. తిరుపతిలో ల్యాండ్‌ కావలసిన విమానం గంటపాటు గాలిలోనే చక్కర్లు కొట్టింది. ఆ సమయంలో విమానంలో ఉన్న మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్యే రోజా, జోగీశ్వరరావు సహా ప్రయాణీకులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. తిరుపతిలో ల్యాండ్‌ చేయలేక ప్రయాణీకులను బెంగళూరుకు తీసుకువెళ్లి వదిలిపెట్టారు. వాస్తవంగా టెక్నికల్‌ సమస్యతో విమానాన్ని ల్యాండిరగ్‌ చేయలేకపోయారని ఎమ్మెల్యే రోజా ఆరోపించారు. అసలు విషయం చెప్పకుండా వాతావరణంవిూద సాకులు చెప్పారని ఆమె అన్నారు. తిరుపతిలో దించకుండా బెంగళూరులో దించారని ఒక్కో ప్రయాణీకుడి నుంచి రూ. 5వేలు డిమాండ్‌ చేశారని రోజా అన్నారు. తమను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన ఇండిగో విమాన సంస్థపై నష్టపరిహారం కేసు పెడతామని అన్నారు. ఇక విమానంలో సమస్యలపై యాజమాన్యం సరిగా స్పందించలేదని, వాతావరణ సమస్యా లేక సాంకేతిక సమస్యా అనే విషయంలో స్పష్టత ఇవ్వడం లేదని యనమల రామకృష్ణుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే రాజమండ్రి`తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఉదయం 9.20కి రాజమండ్రి నుంచి బయలుదేరిన విమానం ఉదయం 10.20కి తిరుపతికి చేరాల్సి ఉంది. అయితే సాంకేతిక లోపం కారణంగా విమానం గంటపాటు గాలిలో చక్కర్లు కొట్టింది. అనంతరం తిరుపతిలో దిగకుండా బెంగళూరులో ల్యాండ్‌ అయింది. రెండు గంటలుగా ప్రయాణికుల విమానంలోనే ఉన్నారు. విమానంలో ఎమ్మెల్యే రోజాతో పాటు పలువురు వీఐపీలు ఉన్నారు. ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని అధికారులు వెల్లడిరచారు. విమానంలో ఉన్న నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విూడియాతో ఫోన్‌లో మాట్లాడుతూ.. తాను ప్రయాణిస్తున్న ఇండిగో విమానం సాంకేతిక లోపం కారణంగా బెంగళూరు ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ చేశారని తెలిపారు. కానీ అక్కడ అనుమతి ఉందో లేదో తెలియదని తెలిపారు. డోర్లు కూడా ఓపన్‌ చేయలేదని రోజా అన్నారు. ఆకాశంలో మేఘాలు ఎక్కువగా ఉండటం వల్ల స్వల్పంగా విమానం ఊగినట్లు తెలిపారు. కింద ల్యాండ్‌ కనిపించడం లేదని అధికారులు తెలిపారని అన్నారు. సాంకేతిక లోపం ఉన్నందున బెంగళూరు ఎయిర్‌పోర్టులో వరకు తీసుకువచ్చామని చెప్పారని రోజా తెలిపారు. బెంగళూరు వరకు తీసుకు వచ్చారంటే ఏదో మేజర్‌ సమస్య ఉన్నట్లు కనిపిస్తోందని తెలిపారు. సాంకేతిక సిబ్బంది పరిశీలించిన అనంతరం విమానం నుంచి ప్రయాణికులను పంపిస్తామని తెలిపినట్లు చెప్పారు. మళ్లీ విమానం తిరుపతికి వెళుతుందని చెబుతున్నారని కానీ ఎంత సమయం పడుతుందో స్పష్టంగా చెప్పడం లేదని ఎమ్మెల్యే రోజా తెలిపారు.
అయితే విమానం ఉన్న ప్రయాణికులు తమను కింద దింపాలని అంటున్నారని తెలిపారు. అయితే సిబ్బంది మాత్రం తమకు భద్రతపరమైన అనుమతులు వస్తే దింపుతామని చెప్పారని రోజా తెలిపారు. అదనంగా టికెట్‌కు రూ. 5వేలు అడిగారని, ఇండిగోపైన కేసు వేస్తానని రోజా అన్నారు.