24 నుంచి ఆన్‌లైన్‌ బోధన


` 54శాతం మంది ఉద్యోగులు హాజరుకావాలి
హైదరాబాద్‌,జనవరి 22(జనంసాక్షి):రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం నివారణ చర్యలు వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవులు పొడిగించిన రాష్ట్ర విద్యాశాఖ తాజాగా మరో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 24 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోని 8, 9, 10 తరగతుల విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా తరగతులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు పాఠశాలలకు హాజరయ్యే ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర సిబ్బంది సైతం రోటేషన్‌ పద్ధతిలో 50 శాతం మంది మాత్రమే విధులకు హాజరుకావాలని పేర్కొంది. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ, ఇవి అమలయ్యేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది.