తెలుగుదేశం ఓ డబ్బా పార్టీ


గుడివాడలో కాసినోకు 500 కోట్లు వస్తే..గోవా సంగతి

అబద్దాల ప్రచారంలో టిడిపి నేతలు దిట్ట
చంద్రబాబు,టిడిపిలపై మరోమారు మండిపడ్డ మంత్రి కొడాలి నాని
గుడివాడ,జనవరి29 (జనంసాక్షి):  టీడీపీ ఓ దిక్కుమాలిన పార్టీ అని..డబ్బా పార్టీ అని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. కేసినోపై టిడిపి నేతలు అబద్దాల ప్రచారంతో తనకు వచ్చేనష్టం లేదన్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇస్తున్నానని,వారికి చేతనైంది చేసుకోవాలని సవాల్‌ విసిరారు. మూడు రోజుల క్యాసినోకు రూ.500 కోట్లు వస్తే మరి 50 క్యాసినోలు ఉన్న గోవాలో ఎన్ని వేలకోట్లు రావాలని కొడాలి నాని ప్రశ్నించారు. టీడీపీ వాళ్లు ఈ వ్యవహారంపై త్వరలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు కూడా ఫిర్యాదు చేస్తారేమో అంటూ ఎద్దేవా చేశారు. ఈ సందర్బంగా టీడీపీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబుపై మరోసారి మంత్రి కొడాలి నాని తీవ్ర విమర్శలు చేశారు. గుడివాడలో ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మంత్రి కొడాలి నాని అనంతరం విూడియాతో మాట్లాడారు. రాజకీయాలకు అతీతంగా కృష్ణా జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసే జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెడితే అభినందించాల్సింది పోయి ఇంగిత జ్ఞానం లేకుండా టీడీపీ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి కొడాలి నాని మండిపడ్డారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిందేవిూ లేకపోయినా ఆయన డబ్బా విూడియా వివిధ రకాలుగా ప్రచారం చేసినా ప్రజలు అవేవీ నమ్మకుండా టీడీపీకి తగిన బుద్ధి చెప్పారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. రాజకీయ పరంగా ఎన్టీఆర్‌, వైఎస్‌ఆర్‌ మధ్య వైరం ఉన్నా తమ సీఎం జగన్‌ అవేవిూ పట్టించుకోకుండా తెలుగు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసిన ఎన్టీఆర్‌ను స్మరించుకునేందుకు కొత్త జిల్లాకు ఎన్టీఆర్‌ పేరు పెట్టారని వివరించారు. వైఎస్‌ఆర్‌ ఆశయాలనే కాకుండా ఎన్టీఆర్‌ చేసిన సేవలను జగన్‌ ఆదర్శంగా తీసుకుని పాలన సాగిస్తున్నారని తెలిపారు. వైఎస్‌ఆర్‌, ఎన్టీఆర్‌లనే కాకుండా అంబేద్కర్‌, జగ్జీవన్‌రామ్‌, వంగవీటి రంగా వంటి ఎందరో ప్రముఖుల బాటలో జగన్‌ నడుస్తున్నారన్నారు. అటు గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే.. 362 రోజులు టీడీపీ చీర్‌ బాయ్స్‌ ప్రచారం చేస్తున్నారని మంత్రి కొడాలి నాని విమర్శించారు. గుడివాడలో నన్ను ఒడిరచలేకే లేనిపోని ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. గుడివాడ ప్రజలు అమాయకులు కాదు, వారికి అన్ని విషయాలు తెలుసు. స్థానిక టీడీపీ నేతలు కూడా పట్టించుకోని విషయాన్ని, టీడీపీ చీర్‌ బాయ్స్‌ పోలీసులకు ఫిర్యాదులు చెయ్యడం అవివేకం. గుడివాడలో క్యాసినో వ్యవహారంపై త్వరలో బైడెన్‌కు కూడా టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తారేమో?. గుడివాడలో మూడు రోజులు క్యాసినో జరిగితే, 362రోజులు టీడీపీ చీర్‌ బాయ్స్‌ ప్రచారం చేస్తున్నారు. టీడీపీ నేతలకు జీవితకాలం టైం ఇచ్చాను వారికి చేతనైంది చేసుకోవాలి’ అని మంత్రి కొడాలి నాని అన్నారు.