ఫీవర్‌ సర్వేలో పాల్గొన్న మంత్రులు

 

 


 


సిద్దిపేట,జనవరి 22(జనంసాక్షి):కరోనాను ఎదుర్కొనేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఫీవర్‌ సర్వేను రాష్ట్రప్రభుత్వం చేపట్టింది. గ్రామాలు మొదలు పట్టణాల వరకు ఆరోగ్య సిబ్బంది తిరుగుతూ సర్వే చేపట్టారు. ప్రారంభించిన తొలిరోజే శుక్రవారం 12 లక్షల మందికి పరీక్షలు వైద్యాధికారులు చేశారు. సిద్ధిపేట పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటి ఫీవర్‌ సర్వేలో ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటిలోని అదరిని టీకా తీసుకున్నారా లేదా అని మంత్రి హరీష్‌ రావు అడిగి తెలుసుకున్నారు. కరోనా కట్టడికి నాయకులు, అధికారులు కలిసి పనిచేయాలని మంత్రి సూచించారు. హోమ్‌ కిట్‌ ద్వారా కరోనా లక్షణాలు పోతున్నాయని మంత్రి తెలిపారు. ప్రతిరోజు వారీ ఆరోగ్య స్థితిని తెలుసుకునేందుకు వైద్యులు పరీక్షలు నిర్వహిస్తారన్నారు. అన్ని రకాల వైద్యం చేస్తారన్నారు. 5 నుండి 8 వారాలు ఈ సర్వే చేయిస్తారని మంత్రి తెలిపారు. లైన్‌ ఎక్కువగా ఉన్న చోట్ల మరిన్ని సెంటర్లను పెంచుతామని హరీష్‌ రావు పేర్కొన్నారు. మందుల ద్వారా కరోనాను ఎదుర్కొగలిగినప్పటికీ ప్రతి రోజు సర్వే చేస్తున్నాం, నీతి ఆయోగ్‌ కూడా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న సర్వే పట్ల సంతోషం వ్యక్తం చేసిందని మంత్రి హారీష్‌ రావు పేర్కొన్నారు. పిల్లలు కోసం ప్రత్యేక, పెద్దల కోసం ప్రత్యేక వార్డులను లాంఛనంగా ఏర్పాటు చేశామన్నారు.కోటికి పైగా హోమ్‌ కిట్‌లను ప్రభుత్వం సిద్ధం చేసిందన్నారు. ప్రతి గ్రామంలో కిట్‌లను రెడీ చేశాం. ప్రజల ఆరోగ్యం కోసమే ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. 370 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ రెడీగా ఉంచాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా డాక్టర్లు ఖాళీ లేకుండా ఖాళీలను పూర్తి చేయాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారని మంత్రి వెల్లడిరచారు. ప్రజలు ఎవరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆశా కార్యకర్తలకు సమాచారం అందించి వారి సేవలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని, దీనివల్ల ఎలాంటి ప్రాణ హాని ఉండదని మంత్రి తెలిపారు. సర్వేలో పాల్గొన్న అధికారులందరికీ మంత్రి కృతజ్ఞతలు తెలిపారు.