ముంచుకొస్తున్న ఒమిక్రాన్‌ ముప్పు

 



` తగ్గని కారోనా ఉధృతి
` దేశవ్యాప్తంగా 2,58,089 కేసులు నమోదు
` ఒక్కరోజే 385మంది మృత్యువాత
న్యూఢల్లీి,జనవరి 17(జనంసాక్షి): దేశంలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కేసుల సంఖ్య భారీగా నమోదవుతోంది. ఎన్నడూ లేనంతగా.. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కేసులు నమోదవు తున్నాయి. కాగా.. గడిచిన 24 గంటల్లో కేసుల సంఖ్య కాస్త తగ్గింది. దేశవ్యాప్తంగా 2,58,089 కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు.. ఈ మహమ్మారి కారణంగా ఒక్కరోజే 385మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్యశాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులెటిన్‌ను విడుదల చేసింది. ఆదివారంతో పోల్చుకుంటే.. 13,113 కేసులు తగ్గినట్లు కేంద్రం పేర్కొంది. కాగా.. దేశంలో పాజిటివిటి రేటు గణనీయంగా పెరుగుతోంది. గత 24 గంటల్లో 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరిగింది. వారం పాజిటివిటీ రేటు 14.41 శాతంగా ఉన్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం దేశంలో 16,56,341 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కాగా నిన్న కరోనా నుంచి 1,51,740 మంది బాధితులు కోలుకున్నారు. వీరితో కలిపి కోలుకున్న వారి సంఖ్య 3,53,37,461 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రికవరీ రేటు 94.27 శాతంగా ఉంది. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 3,73,80,253 కి చేరగా.. మరణాల సంఖ్య 4,86,451కి పెరిగింది.దేశంలో కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ సైతం అలజడి సృష్టిస్తోంది. రోజురోజుకూ ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఇప్పటివరకు దేశంలో 8,209
ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి. 6శాతం కేసులు పెరిగాయి.ఇదే సమయంలో పాజిటివిటీ రేటు 16 శాతం నుంచి 19 శాతానికి పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. దేశంలో తాజాగా 2,58,089 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో కరోనాతో 385 మంది మృతి చెందినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బులిటెన్‌లో పేర్కొన్నది. గడిచిన 24 గంటల్లో కరోనా నుంచి 1,51,740 మంది కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 16,56,341 కరోనా యాక్టీవ్‌ కేసులు ఉన్నాయి. కరోనా కేసుల్లో స్వల్పంగా తగ్గుముఖం పట్టినా పాజిటివిటీ రేటు 16.28 శాతం నుంచి 19.65 శాతానికి పెరగడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. దేశంలో ఇప్పటి వరకు మొత్తం 8209 ఒమిక్రాన్‌ కేసులు నమోదైనట్టు గణాంకాలు చెబుతున్నాయి. సుమారు 157 కోట్ల వ్యాక్సిన్‌ డోసులను అందించినట్టు బులిటెన్‌లో పేర్కొన్నారు. భారత్‌లోని 29రాష్టాల్ల్రో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసులు నమోదవుతున్నాయి. కేసుల పెరుగుదల కారణంగా అనేక రాష్టాల్ల్రో ఇప్పటికే నైట్‌ కర్ఫ్యూ, వీకెండ్‌ కర్ఫ్యూలను అమలు చేస్తున్నారు. రాబోయే రోజుల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దేశంలో వ్యాక్సినేషన్‌ పక్రియ కూడా ముమ్మరంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దేశంలో 157.20 కోట్ల టీకా డోసులను వేసినట్లు కేంద్రం తెలిపింది. గత 24 గంటల్లో 39 లక్షల డోసులు పంపిణీ చేశారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్ర, ఢల్లీిలో కేసులు నమోదవు తున్నాయి. మహారాష్ట్రలో నిన్న 41,327 కొత్త కరోనావైరస్‌ కేసులు నమోదయ్యాయి. 29 మంది ఈ మహమ్మారితో మరణించారు. ఢల్లీిలో ఆదివారం 18,286 కరోనా కేసులు నమోదు కాగా.. 28 మంది మరణించారు.