ఖమ్మంలో క్యాథ్‌లాబ్‌ ప్రారంభం


` ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
` కరోనా వ్యాప్తి కారణంగగా నిర్లక్ష్యం తగదు
` ఖమ్మంలో త్వరలో కీమో థెరఫీ, రేడియో థెరఫీ సేవలు
` జిల్లా ఆస్పత్రిలో పలు సేవలు ప్రారంభించిన మంత్రి హరీష్‌ రావు
ఖమ్మం,జనవరి 28(జనంసాక్షి): ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని... నిర్లక్ష్యం చేయవద్దని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు సూచించారు. అందరికీ బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్నామని హరీష్‌రావు తెలిపారు.ఉమ్మడి ఖమ్మం జిల్లా వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో మంత్రులు హరీష్‌ రావు, పువ్వాడ అజయ్‌ కుమార్‌ సవిూక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. ఖమ్మంలో త్వరలో కీమో థెరఫీ, రేడియో థెరఫీ సేవలు అందించనున్నట్టు తెలిపారు. వచ్చే ఆర్థిక ఏడాదిలో ఖమ్మం ఆస్పత్రిలో అత్యాధునిక ఎంఆర్‌ఐ స్కాన్‌ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. కరోనా పాజిటివ్‌ ఉన్న గర్భిణీలకు ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు జరుగుతున్నాయన్నారు. త్వరలో ఆదిలాబాద్‌లో కూడా క్యాథ్‌ల్యాబ్‌ ఏర్పాటు చేస్తామని ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ రావు తెలిపారు. ఖమ్మం జిల్లా ఆసుపత్రిలో అధునాతన క్యాథ్‌ ల్యాబ్‌, ట్రామా కేర్‌, మిల్క్‌ బ్యాంక్‌ ను హరీష్‌ ప్రారంభిం చారు. గుండె సంబంధిత వ్యాధులకు వైద్యులను అందుబాటులో ఉంచుతామని హెచ్చరించారు. తెలంగాణలో రెండో మిల్క్‌ బ్యాంక్‌ ఏర్పాటు చేశామని, మధిర, సత్తుపల్లిలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వివరించారు. వచ్చే ఏడాది ఖమ్మం ఆస్పత్రిలో ఎంఆర్‌ఐ సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఖమ్మం మార్చురీని కూడా అధునీకరిస్తామని, ఫీవర్‌ సర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. 77 లక్షల ఇండ్లలో ఫీవర్‌ సర్వే జరిపి మెడికల్‌ కిట్లను అందజేశామని హరీష్‌ రావు ప్రశంసించారు. ఇప్పటికే చాలా జిల్లాల్లో ఫీవర్‌ సర్వే పూర్‌ఖ్తెందని, థర్డ్‌వేవ్‌లో ఫీవర్‌ సర్వేతో మంచి ఫలితాలు వచ్చాయని కితాబిచ్చారు. థర్డ్‌వేవ్‌ను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇప్పటికే కోటి హోం ఐసోలేషన్‌ కిట్లు సిద్ధంగా ఉంచామన్నారు. థర్డ్‌ వేవ్‌లో 86 ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఎª`లాంట్లను ఏర్పాటు చేశామని, వంద శాతం వ్యాక్సినేషన్‌లో ఖమ్మం రెండో స్థానంలో ఉందని, తెలంగాణలో ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేసుకోవాలని సూచించారు. 60 ఏళ్ల వారితో పాటు ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌కు బూస్టర్‌ డోసు వేస్తామన్నారు. హైదరాబాద్‌ తరహాలో ఖమ్మంలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తామని హరీష్‌ రావు హావిూ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌, ఎంపి నామా నాగశ్వరరావు, ఎమ్మేల్సీ తాత మధుసూదన్‌, ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్‌ రెడ్డి, రాములు నాయక్‌, టిఎస్‌ఎంఎస్‌ఐడిసి ఛైర్మెన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, వైద్యారోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.